మహేంద్ర సింగ్ ధోని....ఐపిఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఓ సక్సెస్‌ఫుల్ బాటలో నడినిస్తున్న కెప్టెన్. కేవలం కెప్టెన్ గానే  కాదు బ్యాట్ మెన్, వికెట్ కీపర్ రాణిస్తూ చెన్నై కి ఎన్నో మరుపురాని విజయాలు అందించాడు. అయితే అతడు ఇప్పటికే టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలకడం... వెన్నునొప్పితో బాధపడుతుండటం తదితర కారణాల దృష్ట్యా అతడు ప్రపంచ కప్ ముగియగానే క్రికెట్ కు వీడ్కోలు పలికే అవకాశం వుందన్న ప్రచారం జరుగుతోంది. ధోని కూడా ఈ ప్రచారాన్ని ఖండించకపోవడంలో దీనికి బలం చేకూరుతోంది.  ఈ నేపథ్యంలో ధోని రిటైర్మెంట్ పై అభిమానులు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు ఐసిసి ట్విట్టర్ వేదికన ఓ ప్రయత్నం చేసింది.

''ఐసిసి టీ20 వరల్డ్ కప్ లో మహేంద్రసింగ్ ధోని బ్యాట్ నుండి జాలువారే మెరుపు షాట్లను మీరు చూడాలనుకుంటున్నారా ?'' అంటూ ఐసిసి ఓ ట్వీట్ చేసింది. ఐసిసి అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఈ ట్వీట్ కు అభిమానుల నుండి విపరీతమైన స్పందన వస్తోంది. ధోనికి ఒంటిచేత్తో టీ20 ప్రపంచ కప్ సాధించే సత్తా వుందని కొందరు కామెంట్ చేస్తున్నారు. అతడు ఆడాల్సిన అవసరం అవసరం లేదు...కేవలం జట్టులో వుంటే చాలు మిగతా ఆటగాళ్లకు కొండంత బలం వస్తుందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి ధోని 2020 వరల్డ్ కప్ ఆడాలన్నదే ప్రతి అభిమాని అభిప్రాయంగా కనిపిస్తోంది. 

అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్ సీజన్ 12లో ధోనీ అద్భుతంగా ఆడుతున్నప్పటికి గాయాలతో సతమవుతున్నాడు. హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ లో వెన్నునొప్పితో... ఇటీవలే ముంబైతో జరిగిన మ్యాచ్ లో అనారోగ్యంతో దూరమయ్యాడు. అతడికి వెన్నునొప్పి ఇంకా వెన్నునొప్పి బాధిస్తున్నా జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఆడించక తప్పడంలేదని చెన్నై కోచ్ హస్సి పేర్కోన్నాడు. ఇలా గాయాలతో బాధపడుతున్న ధోని ఈ ఏడాది జరిగే వన్డే ప్రపంచ కప్ ఆడటమే ఐసిసి నిర్వహించే టోర్నీల్లో చివరిదని ప్రచారం జరుగుతోంది.