ప్రపంచ దేశాల మధ్య ప్రతిష్టాత్మకంగా జరుగనున్న ఐసిసి వరల్డ్ కప్ ప్రారంభానికే ముందే పాకిస్థాన్ శిబిరంలో ఆందోళన మొదలయ్యింది. ఈ మెగా టోర్నీకి ఇంకా కేవలం 13 రోజుల సమయం  మాత్రమే వుంది. అంతకంతకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ పాకిస్థాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్, సెలెక్టర్లలో ఆందోళన ఎక్కువయ్యింది. దీంతో ప్రపంచ కప్ కోసం  ముందుగా ప్రకటించిన జట్టులో మార్పులు చేశారు. 

ప్రపంచ కప్ లో పాల్గొననున్న పాక్ జట్టులో అనూహ్యంగా సీనియర్ బౌలర్ మహ్మద్ అమిర్ కు చోటు దక్కింది. గురువారం ఇంజమామ్ ఉల్ హక్ నేతృత్వంలోని పాకిస్థాన్ సెలెక్షన్ కమిటీ ప్రత్యేకంగా సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. తాజా పరిణామాలను దృష్టిలో పెట్టుకుని అమిర్ కి ప్రపంచ కప్ జట్టులో చోటు కల్పించినట్లు ఇంజామామ్ వెల్లడించాడు. 

అయితే పాక్ సెలెక్టర్ల అనూహ్య నిర్ణయానికి ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే సీరిసే కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఐదు వన్డేల ఈ సీరిస్ లో  ఇప్పటివరకు మూడు మ్యాచులు ముగిశాయి. ఇందులో  ఓ మ్యాచ్ రద్దవగా మిగతా రెండిట్లో పాక్ బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. బ్యాట్ మెన్స్  ఆకట్టుకుంటున్నా బౌలర్లు మాత్రం ఆతిథ్య జట్టును అడ్డుకోలేకపోతున్నారు. దీంతో రెండింటిలోనూ సాక్ ఘోర ఓటమిని చవిచూసింది. 

దీంతో ప్రపంచ కప్ జరగనున్న ఇంగ్లాండ్ పిచ్ లపై తమ బౌలర్లు తేలిపోవడం పిసిబిని ఆందోళనలోకి నెట్టింది. దీంతో వెంటనే సమావేశమైన సెలెక్టర్లు ప్రపంచ కప్ జట్టు ఎంపికలో తాము చేసిన తప్పును సరిదిద్దుకున్నారు. ఫామ్ లో లేకపోయినా సీనియర్ బౌలర్ మహ్మద్ అమిర్ బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహించగలడని భావించి  అతడికి జట్టులో చోటు కల్పించింది. మొదట ప్రకటించిన ప్రపంచ కప్ ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కకపోయిన అనూహ్య పరిణాలమాలతో అమీర్ కు చోటు దక్కింది.   

(200కోట్ల నుంచి 600కోట్ల) భారీ బడ్జెట్ చిత్రాలతో రెడీ అవుతున్న మన స్టార్స్