Asianet News TeluguAsianet News Telugu

మిచెల్ మార్ష్ సెంచరీ మిస్! వార్నర్, స్టీవ్ స్మిత్, లబుషేన్ హాఫ్ సెంచరీలు... మూడో వన్డేలో ఆసీస్ భారీ స్కోరు...

352 పరుగుల భారీ స్కోరు చేసిన ఆస్ట్రేలియా.. 96 పరుగులు చేసిన మిచెల్ మార్ష్.. హాఫ్ సెంచరీలు చేసుకున్న డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్.. 

Mitchell Marsh, David Warner, Steve Smith, Labuschagne Innings helped Team India to score huge CRA
Author
First Published Sep 27, 2023, 5:22 PM IST

రాజ్‌కోట్‌లో జరుగుతున్న ఆఖరి వన్డేలో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా, నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 352 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆస్ట్రేలియాకి ఓపెనర్లు శుభారంభం అందించారు. 34 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 56 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, వరుసగా మూడో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. హాఫ్ సెంచరీ తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో కెఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు డేవిడ్ వార్నర్...

మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్ కలిసి రెండో వికెట్‌కి 137 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. 84 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 96 పరుగులు చేసిన మిచెల్ మార్ష్, సెంచరీకి 4 పరుగుల దూరంలో అవుట్ అయ్యాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి మార్ష్, ప్రసిద్ధ్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు..

61 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 74 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్‌ని మహ్మద్ సిరాజ్ ఎల్బీడబ్ల్యూ చేశాడు. 19 బంతుల్లో ఓ ఫోర్‌తో 11 పరుగులు చేసిన అలెక్స్ క్యారీ, బుమ్రా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 7 బంతుల్లో 5 పరుగులు చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ని బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు..

13 బంతుల్లో ఓ ఫోర్‌తో 9 పరుగులు చేసిన కామెరూన్ గ్రీన్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. లబుషేన్, ప్యాట్ కమ్మిన్స్ కలిసి ఏడో వికెట్‌కి 46 పరుగులు జోడించారు. 58 బంతుల్లో 9 ఫోర్లతో 72 పరుగులు చేసిన మార్నస్ లబుషేన్, జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ 22 బంతుల్లో ఓ ఫోర్‌తో 19 పరుగులు, మిచెల్ స్టార్ 1 పరుగు చేసి నాటౌట్‌గా నిలిచారు. 

Follow Us:
Download App:
  • android
  • ios