క్రికెట్ ప్రపంచంలో మహేంద్ర సింగ్ ధోనీకి మించిన ట్రెండ్ సెట్టర్ ఉండరేమో. జుంపాల జుట్టుతో ఎంట్రీ ఇచ్చి, రకరకాల హెయిర్ స్టైల్స్, బియర్డ్ స్టైల్స్‌ను ఫ్యాషన్ ప్రపంచానికి పరిచయం చేశాడు మాహీ. గత సీజన్‌లో ట్రెండీ కట్‌తో ఎంట్రీ ఇచ్చిన ధోనీ, ఆ తర్వాత గుండు కొట్టించుకుని కూల్ లుక్‌లో కనిపించాడు.

తాజాగా ఐపీఎల్ 14వ సీజన్ ఆరంభానికి ముందు గుండు కొట్టించుకుని సాధువులా మారాడు ధోనీ భాయ్... ఐపీఎల్ 2021 సీజన్ ప్రోమో కోసం సాధువు అవతారంలో కనిపించాడు మహేంద్ర సింగ్ ధోనీ... అయితే కొన్నాళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవి గుండు గీయించుకున్నట్టు ఫోటో ప్రత్యేక్షం అయింది.

అయితే అది మేకప్ ద్వారా జట్టుని కవర్ చేసి, బాల్ హెడ్‌లా కనిపించేలా చేసిన ఆర్టిఫిషియల్ గుండు అని తర్వాత తెలిసింది. మాహీ విషయంలో కూడా ఇదే ఫార్ములాని ఫాలో అయి ఉంటారని, యాడ్‌లో చూస్తుంటేనే అది నిజం గుండు కాదని అర్థం అవుతోందని అంటున్నారు అభిమానులు.