బంతిని బలంగా బాది, బౌండరీ దాటించడంతో విండీస్ బ్యాట్స్‌మెన్ క్రిస్‌గేల్ దిట్ట. ఈ ఆరు అడుగుల ఆజానుబాహుడు సిక్సర్లు కొడుతూ ఉంటే, ఎంతటి ఫీల్డర్ అయినా చూస్తూ నిల్చుకోవాల్సిందే. అచ్చు క్రిస్‌గేల్‌లాగే బ్యాటింగ్ చేస్తున్న ఓ బుడతడి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సరిగ్గా మూడేళ్లు కూడా ఉండని ఓ పిల్లాడు... ప్లాస్టిక్ బ్యాటు పట్టుకుని బౌండరీలు బాదుతున్నాడు. మొబైల్‌లో గేమ్ ఆడుతున్నట్టుగా బంతి రాగానే, దాన్ని మెరుపు వేగంతో బాదేస్తున్నాడు.


ఈ వీడియో తెగ నచ్చేయడంతో క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన ఇన్‌స్టా అకౌంట్‌లో షేర్ చేశాడు. ఈ పిల్లాడి బ్యాటింగ్ స్టైల్‌ను చాలామంది గేల్‌తో పోలుస్తుంటే, మరికొందరు భారత స్టార్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్‌తో పోలుస్తున్నారు.

ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి...