సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎల్ నాగేశ్వరరావు హెచ్ సిఎ ప్రక్షాళనకు పూనుకున్నారు. పెద్ద తలకాయలకు షాక్ ఇచ్చారు. దీన్ని మొహమ్మద్ అజరుద్దీన్ ఆహ్వానించారు.

హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సిఎ)ను కొంత మంది ఉక్కు పిడికిలి నుంచి బయట పడేయడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 80 క్రికెట్ క్లబ్ లకు చెందిన ప్రతినిధులను హెచ్ సిఎ కార్యవర్గ కమిటీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేకుండా చేశారు. వారిని ఓ టర్మ్ పాటు నిలువరించారు. దీనిపల్ల హెచ్ సిఎ మాజీ అధ్యక్షుడు, టీడిండియా మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజరుద్దీన్ హర్షం వ్యక్తం చేశారు. 

దాదాపు 80 ఎగ్జిక్యూటివ్ కమిటీల సభ్యులను డిబార్ చేసినప్పటికీ ఆ క్లబ్ ల్లోని క్రికెటర్లకు అన్యాయం జరగుకుండా చూస్తామని ఎల్. నాగేశ్వర రావు అన్నారు. కాగా నాగేశ్వరరావు హెచ్ సిఎ ఎన్నికల అధికారిని నియమించనున్నారు. వారంలోగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. 

ఏడు క్లబ్ లను నియంత్రిస్తున్న పురుషోత్తమ్ అగర్వాల్ ను, ఆయన కుటుంబ సభ్యులను నాగేశ్వరరావు డిబార్ చేశారు. మాజీ క్రికెటర్ల అర్షద్ అయూబ్, వంకా ప్రతాప్, కమిటీ పదవీ కాలం ముగియనున్న కార్యదర్శి ఆర్. విజయానంద్, ఉపాధ్యక్షుడు కె. జాన్ మనోజ్, 1983 ప్రపంచ కప్ జట్టు మేనేజర్ పిఆర్ మాన్ సింగ్, టి. శేష్ నారాయణ్, పి. యాదగిరి, సుదర్శన్ రాజులను ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్షులుగా ప్రకటించారు. ఆ క్లబ్ ల సభ్యులు కాకపోవడంతో జి. వివేకానంద, ఎన్. శివలాల్ యాదవ్ వేటు నుంచి తప్పించుకున్నారు.

ఒక వ్యక్తి లేదా అతని కుటుంబ సభ్యులు ఒక క్లబ్ లో కన్నా ఎక్కువ క్లబ్ ల్లో సభ్యత్వం కలిగి ఉండి కూడదని ఆదేశింాచరు. నాగేశ్వర రావు నిర్ణయాలను అజరుద్దీన్ ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. బోగస్ ఓట్లను నివారించడానికి నాగేశ్వర రావు చర్యలు ఉపయోగపడుతాయని ఆయన అన్నారు.