Asianet News TeluguAsianet News Telugu

గాయంతో మూడు నెలలు ఆటకు దూరం.. ఐపీఎల్ నుంచి జెమీసన్ ఔట్..! సీఎస్కేకు భారీ షాక్

IPL 2023: ఐపీఎల్ ప్రారంభానికి ముందే  ఈ లీగ్ లో మోస్ట్ సక్సెస్‌ఫుల్  ఫ్రాంచైజీగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ షాక్. ఆ జట్టు  స్టార్ బౌలర్ గాయంతో వెనుదిరిగాడు. 

Kyle Jamieson Likely To Miss Entire IPL due To Back Injury MSV
Author
First Published Feb 20, 2023, 6:19 PM IST | Last Updated Feb 20, 2023, 6:19 PM IST

వచ్చే నెల 31 నుంచి  ఐపీఎల్  - 2023 సీజన్ మొదలుకానున్న నేపథ్యంలో  ఫ్రాంచైజీలన్నీ  ఆ ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. అందుబాటులో ఉన్న  ఆటగాళ్లతో   జట్టు కూర్పు,  అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చలు జరుపుతున్నాయి. కానీ చెన్నై సూపర్ కింగ్స్ కు మాత్రం గత సీజన్ లో మాదిరిగానే ఇప్పుడు కూడా గాయాలు వేధిస్తున్నాయి. ఆ జట్టు  స్టార్ పేసర్ కైల్ జెమీసన్  గాయంతో ఐపీఎల్  లో వచ్చే సీజన్ ఆడేది అనుమానంగానే ఉంది.   ఏడాది తర్వాత ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చేందుకు అతడు యత్నించినా  నడుము నొప్పి మళ్లీ తిరగబెట్టింది. 

గతేడాది  న్యూజిలాండ్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లగా ఆ సిరీస్ లో తొలి టెస్టు ఆడిన  జెమీసన్.. రెండో టెస్టుకు గాయపడ్డాడు.   ఆ తర్వాత అతడు  అంతర్జాతీయ క్రికెట్ కు దూరమయ్యాడు.   తిరిగి ఇటీవలే  ఇంగ్లాండ్ తో న్యూజిలాండ్ ఆడుతున్న రెండు మ్యాచ్ ల టెస్టు  సిరీస్ కు ఎంపికయ్యాడు. 

ఇంగ్లాండ్ తో ప్రాక్టీస్ మ్యాచ్ లో భాగంగా  ఆడిన జెమీసన్.. తొలి టెస్టుకు ముందు గాయపడ్డాడు.  దీంతో అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా  జెమీసన్ కు  మరోసారి శస్త్రచికిత్స అవసరమని వైద్యులు తేల్చారు.  ఆపరేషన్ తర్వాత అతడికి మూడు నుంచి నాలుగు నెలల పాటు విరామం తీసుకోవాలని  సూచించినట్టు వార్తలు వస్తున్నాయి. ఐసీసీ  కూడా తన ట్విటర్ ఖాతాలో ఇదే విషయాన్ని పోస్ట్ చేసింది.  దీంతో  జెమీసన్.. ఐపీఎల్ లో  16వ సీజన్ మొత్తం అందుబాటులో ఉండడు.  బౌలింగ్ తో పాటు బ్యాటింగ్  కూడా చేయగల సామర్థ్యమున్న  జెమీసన్ లేకపోవడం  సీఎస్కేకు ఎదురుదెబ్బే అని  ఆ జట్టు ఫ్యాన్స్ భావిస్తున్నారు. 

 

ఆరు ఫీట్ ఆరు అంగుళాల హైట్ ఉండే ఈ కివీస్ బౌలర్  టెస్టులలో ఆ జట్టుకు కీలకబౌలర్. 2021లో ఇంగ్లాండ్ లో భారత్ - న్యూజిలాండ్ మధ్య జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో జెమీసన్..   టీమిండియాను ఓడించడంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో అతడు ఏడు వికెట్లు పడగొట్టాడు. 

కాగా  ఈ ప్రదర్శనతో జెమీసన్ ను 2021లో  ఆర్సీబీ  ఏకంగా రూ. 15 కోట్లతో కొనుగోలు చేసింది.  కానీ ఆ  సీజన్ లో   జెమీసన్.. 9 మ్యాచ్ లు ఆడి   9 వికెట్లు మాత్రమే తీశాడు.  బ్యాటింగ్ లో 65 పరుగులు మాత్రమే సాధించాడు. దీంతో తర్వాత సీజన్ లో ఆర్సీబీ అతడిని వదిలేసింది. 2023 సీజన్ లో  చెన్నై సూపర్ కింగ్స్.. జెమీసన్ ను  కోటి రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసింది. 

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios