వరుసగా రెండో సెంచరీ చేసిన శిఖర్ ధావన్...రెండు వికెట్లు తీసిన షమీ...గబ్బర్ తప్ప మిగిలిన బ్యాట్స్‌మెన్ ఫెయిల్...

IPL 2020: టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్... నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. ఓపెనర్ పృథ్వీషా 7 పరుగులే చేసి మరోసారి నిరాశపరిచాడు. శ్రేయాస్ అయ్యర్ 14 పరుగులకి అవుట్ కాగా, శిఖర్ ధావన్ ఐపీఎల్ 2020 సీజన్‌లో వరుసగా రెండో సెంచరీ బాదాడు. 28 బంతుల్లో అర్ధశతకం పూర్తిచేసుకున్న శిఖర్ ధావన్... 58 బంతుల్లో శతకాన్ని పూర్తిచేసుకున్నాడు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఐపీఎల్ చరిత్రలో వరుస మ్యాచుల్లో రెండు వరుస సెంచరీలు చేసిన మొట్టమొదటి క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు శిఖర్ ధావన్. ఓ వైపు వికెట్లు పడుతున్నా, తన దూకుడు కొనసాగించిన ‘గబ్బర్’... 61 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 106 పరుగులు చేశాడు. రిషబ్ పంత్ 14 పరుగులు చేయగా స్టోయినిస్ 9 పరుగులు, హెట్మయర్ 10 పరుగులు చేశాడు. 

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బౌలర్లలో షమీ రెండు వికెట్లు తీయగా మ్యాక్స్‌వెల్, మురుగన్ అశ్విన్, జేమ్స్ నీషమ్ తలా ఓ వికెట్ తీశారు.