ఐపిఎల్ లో భాగంగా జరిగిన మ్యాచులో కోల్ కతా నైటర్ రైడర్స్ పై వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. రెండు బంతులు మిగిలి ఉండగానే చెన్నై 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. సురేష్ రైనా నిలకడగా ఆడుతూ రావడం వల్ల, చివరలో రవీంద్ర జడేజా బ్యాట్ ను ఝళిపించడం వల్ల విజయం సాధ్యమైంది. జడేజా 17 బంతుల్లో ఐదు ఫోర్ల సాయంతో 31 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సురేష్ రైనా 42 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లలో నరైన్, చావ్లా రెండేసి వికెట్లు తీసుకోగా, గుర్నీకి ఒక వికెట్ దక్కింది.

కోల్ కతా నైట్ రైడర్స్ పై మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నిరాశపరిచాడు. 13 బంతుల్లో ఓ సిక్స్ సాయంతో 16 పరుగులు చేసి నరైన్ బౌలింగులో ఎల్బీడబ్ల్యుగా వెనుదిరిగాడు. దీంతో 121 పరుగుల వద్ద చెన్నై ఐదో వికెట్ కోల్పోయింది.రావడంతోనే దూకుడుగా ఆడిన కేదార్ జాదవ్ ఒక సిక్స్, మూడు ఫోర్ల సాయంతో 12 బంతుల్లో 20 పరుగులు చేసి చావ్లా బౌలింగులో ఎల్బీడబ్ల్యుగా వెనుదిరిగాడు. దీంతో చెన్నై 81 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.

కోల్ కతా నైట్ రెడర్స్ తమ ముందు ఉంచిన 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ 61 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. అంబటి రాయుడు కేవలం 5 పరుగులు చేసి చావ్లా బౌలింగులో ఊతప్పకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.చెన్నై సూపర్ కింగ్స్ 44 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. డూప్లెసిస్ 24 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నరైన్ బౌలింగులో వెనుదిరిగాడు.చెన్నై సూపర్ కింగ్స్ 29 పరుగుల స్కోరు వద్ద తొలి వికెట్ కోల్పోయింది. వాట్సన్ 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు.

స్పిన్నర్ తాహిర్ ధాటికి భారీ స్కోరు సాధిస్తుందనుకున్న నైట్ రైడర్స్ చతికిలబడింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసి.. చెన్నై ముందు 162 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.కోల్‌కతా బ్యాట్స్‌మెన్లలో క్రిస్‌లేన్ 82 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తాహిర్ 4 వికెట్లు పడగొట్టి నైట్‌రైడర్స్ వెన్ను విరిచాడు. శాంట్నర్ 1, శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు పడగొట్టారు. 

నైట్ రైడర్స్ ఆరో వికెట్ కోల్పోయింది. స్కోరును పెంచే క్రమంలో కెప్టెన్ దినేశ్ కార్తీక్ 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఠాకూర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడుప్రమాదకర రస్సెల్‌ను తాహిర్ బోల్తా కొట్టించాడు. 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షోరేకు క్యాచ్ ఇచ్చి రస్సెల్ వెనుదిరిగాడు. దీంతో నైట్‌ రైడర్స్ ఒత్తిడిలో పడింది. 

విధ్వంసక ఆటగాడు క్రిస్ లిన్‌‌ను తాహిర్ పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 82 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. తాహిర్ మరో బంతికి సీనియర్ బ్యాట్స్‌మెన్ రాబిన్ ఉతప్పను పెవిలియన్‌కు పంపాడు. దీంతో నైట్ రైడర్స్ కష్టాల్లో పడింది.ధాటిగా ఆడిన నితీష్ రానాను తాహిర్ బోల్తా కొట్టించాడు. దీంతో 41 పరుగుల భాగస్వామ్యానికి తెరపడినట్లయ్యింది

క్రిస్ లేన్ అర్థసెంచరీ సాధించాడు. క్రీజులోకి వచ్చిన నాటి నుంచి ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడిన అతను 36 బంతుల్లో 7 ఫోర్లు , 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇది అతనికి ఐపీఎల్‌లో 8వ అర్థసెంచరీ.కోల్‌కతాకు గట్టి దెబ్బ తగిలింది.. ఓపెనర్ సునీల్ నరైన్ 2 పరుగులకే ఔట్ అయ్యాడు.