ఒక్క పరుగుకే అవుటైన కెఎల్ రాహుల్...విరాట్ కోహ్లీ డకౌట్... మూడు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా...
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియాకు శుభారంభం దక్కలేదు. ఇంగ్లాండ్ స్పిన్నర్ అదిల్ రషీద్ మొదటిసారి తొలి ఓవర్ వేసి, కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. రెండో ఓవర్ వేసిన జోఫ్రా ఆర్చర్, కెఎల్ రాహుల్‌ను అవుట్ చేసి, టీమిండియాకు షాక్ ఇచ్చాడు.
రెండో ఓవర్‌లో కెఎల్ రాహుల్ వికెట్ కోల్పోయిన టీమిండియా, పరుగులేమీ చేయలేకపోయింది. ఆ తర్వాతి ఓవర్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించిన విరాట్ కోహ్లీ, అదిల్ రషీద్ బౌలింగ్‌లో జోర్డాన్‌కి క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు.
3 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయిన టీమిండియా, పీకల్లోతు కష్టాల్లో పడింది.
