బౌండరీ లైన్ దగ్గర గాల్లోకి ఎగురుతూ సిక్సర్‌ను ఆపిన కెఎల్ రాహుల్... వీడియో వైరల్స్వల్ప లక్ష్యచేధనలో ఈజీ విజయం దిశగా సాగుతున్న ఇంగ్లాండ్...
బ్యాటింగ్‌లో ఒక్క పరుగుకే అవుట్ అయి, నిరాశపర్చిన భారత క్రికెటర్ కెఎల్ రాహుల్, ఫీల్డింగ్‌లో అదరగొట్టాడు. బౌండరీ లైన్ దగ్గర కళ్లు చెదిరే ఫీల్డింగ్ విన్యాసంతో క్రికెట్ అభిమానుల మనసు దోచుకున్నాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో జోస్ బట్లర్, ఓ భారీ సిక్సర్‌కి ప్రయత్నించాడు.
అయితే బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న కెఎల్ రాహుల్, గాల్లోకి ఎగురుతూ సిక్స్ పోకుండా అడ్డుకున్నాడు. కెఎల్ రాహుల్ ఫీల్డింగ్ విన్యాసం క్రికెట్ ఫ్యాన్స్ మనసు దోచుకుంది.
Scroll to load tweet…
జోస్ బట్లర్, జాసన్ రాయ్ తొలి వికెట్‌కి 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో ఈజీ విజయం దిశగా సాగుతోంది ఇంగ్లాండ్ జట్టు. బట్లర్ 28 పరుగులు, జాసన్ రాయ్ 49 పరుగులు చేసి అవుట్ కాగా 13 ఓవర్లు ముగిసేసరికి 107 పరుగులు చేసిన ఇంగ్లాండ్, విజయం ముంగిట నిలిచింది.
