Asianet News TeluguAsianet News Telugu

ఆదుకోని కెఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా... వైజాగ్ వన్డేలో 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా..

India vs Australia 2nd ODI: 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా... తీవ్రంగా నిరాశపరిచిన కెఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా...

KL Rahul, Hardik Pandya goes early, Team India lost 5 wickets in Vizag ODI cra
Author
First Published Mar 19, 2023, 2:30 PM IST

రెండో వన్డేలో టీమిండియా బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్నారు ఆస్ట్రేలియా బౌలర్లు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా... 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. టాపార్డర్‌ ఫెయిల్యూర్‌తో  32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

గత మ్యాచ్‌లో 75 పరుగులు చేసి టీమిండియాని గెలిపించిన కెఎల్ రాహుల్, రెండో వన్డేలో పెద్దగా పరుగులు చేయకుండానే పెవిలియన్ చేరాడు. 12 బంతులు ఆడి ఓ ఫోర్‌తో 9 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు...

డీఆర్‌ఎస్ తీసుకున్నా టీమిండియాకి ఫలితం దక్కలేదు. ఆ తర్వాత 3 బంతుల్లో ఓ సింగిల్ తీసిన హార్ధిక్ పాండ్యా, సీన్ అబ్బాట్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కి అవుట్ అయ్యాడు. 9.2 ఓవర్లలోనే 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది టీమిండియా.. 

టాస్ ఓడి ఇన్నింగ్స్ మొదలెట్టిన టీమిండియాకి తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. 2 బంతులాడిన శుబ్‌మన్ గిల్, మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి లబుషేన్‌కి క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. 3 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా...

ఆ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును కదిలించారు. 15 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసిన రోహిత్ శర్మ, మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్ పట్టిన కళ్లు చెదిరే క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు...

ఆ తర్వాతి బంతికి సూర్యకుమార్ యాదవ్‌ని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు మిచెల్ స్టార్క్. తొలి వన్డేలో మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో డకౌట్ అయిన సూర్యకుమార్ యాదవ్, రెండో వన్డేలోనూ అదే స్టైల్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. వరుసగా రెండు మ్యాచుల్లో గోల్డెన్ డకౌట్ అయిన ప్లేయర్‌గా చెత్త రికార్డు మూటకట్టుకున్నాడు సూర్యకుమార్ యాదవ్...

32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఐదో ఓవర్ బౌలింగ్‌ చేసిన మిచెల్ స్టార్క్, మెయిడిన్ ఓవర్ వేయడంతో పాటు 2 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటిదాకా టీమిండియా 5 వికెట్లు కోల్పోతే అందులో 4 వికెట్లు మిచెల్ స్టార్క్‌కే దక్కాయి.. 

2000వ సంవత్సరం తర్వాత టీమిండియాలో టీమిండియాపై వన్డేల్లో మొదటి పవర్ ప్లే లోపే 4 వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు మిచెల్ స్టార్క్. 2005లో షేన్ బాండ్, 2006లో మిచెల్ జాన్సన్, 2012లో జునైద్ ఖాన్ ఈ ఫీట్ సాధించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios