సారాంశం

ట్రావెల్ రిజర్వుగా ఆసియా కప్‌కి ఎంపికైన సంజూ శాంసన్... పూర్తి ఫిట్‌నెస్‌తో శ్రీలంకకు చేరుకున్న కెఎల్ రాహుల్... రాహుల్ రాకతో స్వదేశానికి పయనమైన సంజూ శాంసన్..

ఆసియా కప్ 2023 టోర్నీకి ట్రావెల్ రిజర్వు ప్లేయర్‌గా ఎంపికయ్యాడు సంజూ శాంసన్. కెఎల్ రాహుల్ ఫిట్‌నెస్ గురించి సరైన క్లారిటీ రాకపోవడంతో సంజూ శాంసన్‌ని సపోర్టింగ్ స్టాఫ్‌తో పాటు లంకకు తీసుకెళ్లింది భారత జట్టు. అయితే కెఎల్ రాహుల్ అనుకున్నట్టుగానే పూర్తిగా కోలుకుని, లంకకు చేరుకున్నాడు..

సూపర్ 4 రౌండ్‌లో పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో కెఎల్ రాహుల్ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే ఇషాన్ కిషన్ రూపంలో మరో వికెట్ కీపింగ్ బ్యాటర్ జట్టులో ఉన్నాడు. దీంతో ట్రావెల్ రిజర్వుగా లంకకు చేరుకున్న సంజూ శాంసన్, నిరాశగా స్వదేశానికి పయనమయ్యాడు..

కొలంబో నుంచి దుబాయ్ చేరుకున్న సంజూ శాంసన్, అక్కడ స్నేహితులతో కొన్ని రోజులు ఏకాంతంగా గడపబోతున్నాడు. దుబాయ్ చేరుకున్నట్టుగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియచేశాడు సంజూ శాంసన్.  ఈ వారంలోనే దుబాయ్ నుంచి స్వదేశానికి వస్తాడు సంజూ శాంసన్..

సంజూ శాంసన్‌కి వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో కూడా చోటు దక్కలేదు. అలాగే ఆసియా క్రీడల కోసం చైనాకి వెళ్లే టీమ్‌లో ప్లేస్ దక్కలేదు. దీంతో సంజూ శాంసన్, వచ్చే రెండు నెలల్లో పూర్తిగా దేశవాళీ టోర్నీలపైనే ఫోకస్ పెట్టబోతున్నాడు..

కేరళ లీగ్‌తో పాటు అక్టోబర్‌లో ప్రారంభమయ్యే సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో సంజూ శాంసన్ ఆడబోతున్నాడు. ఇప్పటిదాకా 12 వన్డేలు ఆడిన సంజూ శాంసన్, 55.71 సగటుతో 391 పరుగులు చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి..

అయితే టీ20ల్లో మాత్రం కెఎల్ రాహుల్ ప్రదర్శన ఆశించినంతగా లేదు. ఇప్పటిదాకా 16 టీ20 మ్యాచులు ఆడిన సంజూ, 21.14 సగటుతో 296 పరుగులు చేశాడు. వెస్టిండీస్ టూర్‌లో వన్డే సిరీస్‌లో రిజర్వు బెంచ్‌కే పరిమితమైన సంజూ శాంసన్, టీ20 సిరీస్‌లో ఆడాడు. అయితే పొట్టి ఫార్మాట్‌లో సంజూ శాంసన్ పెద్దగా రాణించలేకపోవడంతో అతనికి ఆసియా కప్ 2023, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీల్లో ప్లేస్ ఇవ్వలేదు సెలక్టర్లు..

అయితే ఐపీఎల్‌లో టాపార్డర్‌లో బ్యాటింగ్ చేసే సంజూ శాంసన్‌ని టీమిండియా ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్‌కి పంపింది. అందువల్లే సంజూ తన రేంజ్‌ పర్ఫామెన్స్ ఇవ్వడంలో విఫలమయ్యాడని అభిమానులు వాదిస్తున్నారు..

వచ్చే ఏడాది జూన్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్ 2024 లోనూ సంజూ శాంసన్‌కి చోటు దక్కే అవకాశం లేదు. ఎందుకంటే ఆ సమయానికి రిషబ్ పంత్ పూర్తిగా కోలుకోవచ్చు. కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్, వన్డే వరల్డ్ కప్ సమయానికి పూర్తిగా కోలుకుని ఉంటే, ఇషాన్ కిషన్ కూడా టీమ్‌కి ఎంపికయ్యేవాడు కాదు..