బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టి, యువ క్రికెటర్ కేఎల్ రాహుల్ ల మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్టు కొంతకాలంగా వార్తలు గుప్పుమన్నాయి.  తాజాగా అతియా శెట్టి తన ప్రియుడు, క్రికెటర్‌తో బర్త్ డేను జరుపుకోవడంతో వారిద్దరి డేటింగ్ క్లారిటీ వచ్చేసింది. 
అంతేకాదు అతియా శెట్టి  28వ‌ పుట్టిన రోజు మరికాస్త స్పెషల్‌గా ఉండేలా ఓ క్యూట్‌ పోస్టును ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. హ్యాపీ బర్త్‌డే మ్యాడ్‌చైల్డ్‌ అంటూ రాహుల్‌ భుజంపై అతియా తల ఆనించి ఉన్న లవ్లీ ఫోటోను షేర్‌ చేశారు. 

కాగా అతియా, కేఎల్‌ రాహుల్‌ ఏడాది నుంచి డేటింగ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. వారిద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకొని ముంబై వీధుల్లో, హోటల్లో మీడియా కంటికి చిక్కడంతో ఆ రూమర్లకు సంబంధించిన వార్తలకు బలం చేకూరాయి. ఈ జంట ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నా.. ఈ విషయంపై వీరు ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే వారిద్దరి సోషల్​మీడియా పోస్టులు మాత్రం తరచూ వైరల్​ అవుతున్నాయి. 

ఇటీవల రాహుల్​ పుట్టినరోజు సందర్భంగా అతియా శుభాకాంక్షలు తెలుపుతూ ‘అతను నా వ్యక్తి’ అని సోషల్‌ మీడియాలో పేర్కొంది. ఇద్దరు కలిసి తరచూ డిన్నర్‌లు, పార్టీలకు హాజరు అవుతున్నారు. అతియా శెట్టి నటుడు సునీల్ శెట్టి కుమార్తె. 

2015లో హీరో చిత్రంతో అతియా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. చివరిసారిగా  నవాజుద్దీన్ సిద్దిఖీ సరసన ‘మోటిచూర్ చక్నాచూర్’లో కనిపించింది. సంవ‌త్సరం నుంచి రిలేష‌న్‌షిప్‌లో ఉన్న రాహుల్‌, అతియాలు పెళ్లి చేసుకుంటే  మాకు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని సునీల్ శెట్టి దంప‌తులు ఇదివ‌ర‌కే పేర్కొన్నారు.