KKR vs DC : వైజాగ్ లో సునీల్ నరైన్ సునామీ వచ్చింది. ఐపీఎల్ 2024 16వ మ్యాచ్ లో ఢిల్లీ బౌలింగ్ ను చీల్చిచెండాడుతూ కోల్ కతా స్టార్ ప్లేయర్ సునీల్ నరైన్ ఫోర్లు, సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు.
KKR vs DC Sunil Narine : వైజాగ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 16వ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో సునీల్ నరైన్ విధ్వంసం కొనసాగింది. దుమ్మురేపే క్రాకింగ్ షాట్స్ తో ఢిల్లీ బౌలింగ్ ను చీల్చిచెండాడాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో అదరగొట్టాడు. నరైన్ ఆటతో స్టేడియం హోరెత్తిపోయింది. కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. ఐపీఎల్ 2024 సీజన్ లో పవర్ ప్లే లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా కేకేఆర్ ను నిలిపాడు. నరైన్ సూపర్బ్ ఇన్నింగ్స్ తో కేవలం 8 ఓవర్లు ముగియకముందే కేకేఆర్ 100 పరుగులు దాటింది.
ప్రారంభంలో కాస్త నెమ్మదిగా ఆడారు. అయితే, 4వ ఓవర్ లో సునీల్ నరైన్ సునామీ మొదలైంది. ఇషాంత్ శర్మ బౌలింగ్ లో వరుసగా బౌండరీలు బాదాడు. 6, 6, 4, 0, 6, 4 తో ఏకంగా 26 పరుగులు రాబట్టాడు. అలాగే, 6వ ఓవర్ లో రసిక్ సలామ్ బౌలింగ్ లో 0, 4, 6, 0, 4, 4 తో మరోసారి భారీ షాట్లతో అదరగొట్టాడు. సునీల్ నరైన్ సూపర్ ఇన్నింగ్స్ తో కేవలం 8 ఓవర్లలోనే కోల్ కతా 100 పరుగుల మార్కును అందుకుంది.
9 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ ఒక వికెట్ కోల్పోయి 126 పరుగులు చేసింది. 11 ఓవర్ లో 135 పరుగులు చేసిన కేకేఆర్.. సునీల్ నరైన్ 74 పరుగులతో క్రీజులో ఉన్నాడు. తన ఇన్నింగ్స్ లో ఇప్పటికే 7 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. మరో ఎండ్ లో యంగ్ ప్లేయర్ రఘువంశీ కూడా దుమ్మురేపుతున్నాడు. ప్రస్తుతం 34 పరుగులతో క్రీజులో ఉన్న ఈ ప్లేయర్ 4 ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు.
RCB vs LSG : మయాంక్ యాదవ్ విధ్వంసం.. తన రికార్డును తానే బ్రేక్ చేశాడు.. !
