కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు షాకింగ్ న్యూస్. ఆ జట్టు యజమాని, ప్రముఖ పారిశ్రామిక వేత్త నెస్ వాదియాకు జపాన్‌లో డ్రగ్స్‌తో పట్టుబడిన కేసులో రెండేళ్ల జైలు శిక్ష విధించారు. ఈ ఏడాది మార్చిలో 25 గ్రాముల మత్తు పదార్ధాలను కలిగి ఉన్న కేసులో వాదియాకు శిక్ష విధించినట్లుగా తెలుస్తోంది.

నెస్ వాదియా .. వాదియా గ్రూప్ అధినేత నుస్లీ వాదియా వారసుడు. అయితే తాను కేవలం వ్యక్తిగత అవసరాల కోసమే మత్తు పదార్ధాలను తన వద్ద వుంచుకున్నానని అరెస్ట్ అయిన సందర్భంగా నెస్ వాదియా అంగీకరించారు. మరోవైపు వాదియాకు జైలు శిక్షపై వాదియా గ్రూప్ ఇప్పటి వరకు స్పందించలేదు.