స్కూల్లో సరిగా డ్రెస్సింగ్ లేకపోయినా.. జుట్టు సరిగా లేకపోయినా.. స్టూడెంట్స్ ని టీచర్లు తట్టడం చాలా కామన్. ఇలాంటి సందర్భం ప్రతి ఒక్కరికీ ఎప్పుడో ఒకసారి ఎదురై ఉండి ఉంటుంది. మరీ ముఖ్యంగా పీఈటీ మాస్టర్స్ అయితే ఈ విషయంలో మరీ కఠినంగా ఉంటారు. డ్రెస్సింగ్ సరిగాలేకపోతే అస్సలు ఒప్పుకోరు. ఇప్పుడు ఇదంతా ఎందుకుు అని అనుకుంటున్నారా.. ? క్రికెటర్ కేదార్ జాదవ్ విషయంలో చెన్నైసూపర్ కింగ్స్ వేసిన పంచ్.. సరిగ్గా దీనికి సరిపోతోంది కాబట్టి.

ఇంతకీ మ్యాటరేంటంటే..  చెన్నైసూపర్ కింగ్స్ అఫీషియల్ పేజీలో తాజాగా.. ఓ ఫోటో షేర్ చేశారు. అందులో కేదార్ జాదవ్ భిన్నమైన హెయిర్ స్టైల్ తో కనిపిస్తున్నారు. కాగా.. అదే ఫోటోలో సపోర్టింగ్ స్టాఫ్ మెంబర్ కూడా ఒకరు ఉన్నారు.  ఆ హెయిర్ స్టైల్ ఏంటి..? అని కాస్త సీరియస్ గా అడిగితే ఎలా ఉంటుందో.. ఆ ఫోటో కూడా అలా ఉంది.

 

దానిని షేర్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. దానికి హిలేరియస్ క్యాప్షన్ జత చేసింది.‘ పీఈటీ సర్ కి ఇలాంటి హెయిర్ స్టైల్ తో దొరికినప్పుడు’ అంటూ క్యాప్షన్ రాశారు. కాగా.. ఈ పోస్టు ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఇదిలా ఉండగా.. మరి కొద్దిరోజుల్లో ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుంది. క్రికెట్ ప్రియులు దీని కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.