Asianet News TeluguAsianet News Telugu

IPL Auction : మరోసారి హాట్ టాపిక్ గా కావ్యా మారన్.. హోరెత్తిన ట్విట్టర్..

కావ్య మారన్ ఐపిఎల్ మినీ వేలంలో మరోసారి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.  కొచ్చిలో వేలం కొనసాగుతున్నంతసేపు అభిమానులు ట్విట్టర్‌లో మీమ్ లతో హోరెత్తించారు. 

Kavya Maran Is Trending Again In IPL Auction
Author
First Published Dec 24, 2022, 7:55 AM IST

కొచ్చి : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 మినీ-ఆక్షన్ ప్రస్తుతం కొచ్చిలో జరుగుతోంది. ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ సామ్ కుర్రాన్ ఐపిఎల్ వేలం చరిత్రలో అత్యంత ఖరీదైన కొనుగోలుదారుగా నిలిచాడు. అతడిని 18.50 కోట్ల భారీ మొత్తానికి పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. కర్రాన్ దేశీయుడే అయిన హ్యారీ బ్రూక్‌ను ఎస్ఆర్ హెచ్ రూ. 13.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఎస్ఆర్ హెచ్ యజమాని కళానిధి మారన్ కుమార్తె అయిన కావ్య మారన్, ఐపీఎల్ వేలం కోసం కొచ్చికి వచ్చారు. 

ఈ వేలంలో ఆమె మరోసారి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. క్రికెట్ అభిమానులు, కావ్య గురించి తెలిసినవారు మీమ్‌లతో ట్విట్టర్‌ను ముంచెత్తించారు. హారీబ్రూక్, మయాంక్ అగర్వాల్ లను కొనుగోలు విషయంలో ఆచీ తూచీ వ్యవహరించి అందరి చూపూ ఆకర్షించారు. కావ్య మారన్ సన్ నెట్ వర్క్ మేనేజింగ్ డైరెక్టర్ గా చేస్తున్నారు. సన్ నెట్ వర్క్ అధినేత కళానిధి మారన్, కావేరీ మారన్ ల కూతురు కావ్యా మారన్.

అంతకుముందు, న్యూజిలాండ్ బ్యాటర్ కేన్ విలియమ్సన్‌ను గుజరాత్ టైటాన్స్ (జిటి) అతని ప్రాథమిక ధర రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది.
విలియమ్సన్ ఎస్ఆర్ హెచ్ తో IPL 2022లో గొప్పగా ఆడలేదు. 13 మ్యాచ్‌ల్లో 19.64 సగటుతో 216 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ మ్యాచ్ మొత్తంలో ఒక్కసారి మాత్రమే 50 రన్స్ చేశాడు. అతని స్ట్రైక్ రేట్ కూడా 93.51 వద్ద చాలా తక్కువ స్థాయిలో ఉంది. నవంబర్‌లో జరిగే IPL 2023 వేలానికి ముందు అతనిని ఫ్రాంచైజీ విడుదల చేసింది.

 

Follow Us:
Download App:
  • android
  • ios