Asianet News TeluguAsianet News Telugu

కర్మ ఫలాన్ని అనుభవించక తప్పదు దాదా..! బీసీసీఐ నుంచి గంగూలీ ఔట్.. పండుగ చేసుకుంటున్న కోహ్లీ ఫ్యాన్స్

Sourav Ganguly: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ మరో ఐదు రోజుల్లో మాజీ కాబోతున్నాడు.  రెండోసారి బీసీసీఐ బాస్ కావాలన్న దాదా ఆశలు అడియాసలే అయ్యాయి. 

Karma Never Loses an Address: Virat Kohli Fans Trolls Sourav Ganguly After He Walk Away From BCCI Top Post
Author
First Published Oct 12, 2022, 4:26 PM IST

బీసీసీఐ రాజకీయాలకు బలై అధ్యక్ష స్థానం నుంచి ఇష్టం లేకున్నా తప్పుకుంటున్న సౌరవ్ గంగూలీని చూసి టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ ఫ్యాన్స్  పండుగ చేసుకుంటున్నారు. వీళ్లిద్దరి మధ్య  గత కొంతకాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. గతేడాది టీ20 ప్రపంచకప్ ముగిసినప్పట్నుంచి కోహ్లీ-గంగూలీ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి.   విలేకరుల సమావేశాలలో  ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని బోర్డు పరువును రచ్చకీడ్చారని ఇద్దరిపై మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. ఏదేమైనప్పటికీ  దాదా బీసీసీఐ నుంచి వెళ్తుండటంతో కోహ్లీ ఫ్యాన్స్  పండుగ చేసుకుంటున్నారు. కర్మ ఫలాన్ని అందరూ అనుభవించాల్సిందేనని.. దాన్నుంచి ఎవరూ తప్పించుకోలేరని  భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినదానికంటే వివరంగా చెబుతూ దాదాకు కౌంటర్లు ఇస్తున్నారు. 

గతేడాది టీ20 ప్రపంచకప్‌కు ముందు తాను పొట్టి ఫార్మాట్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుని మిగిలినా ఫార్మాట్లలో  సారథిగా కొనసాగుతానని  కోహ్లీ భావించాడు. ఆ మేరకు టీ20 బాధ్యతలకు గుడ్ బై చెప్పాడు. 

అయితే కోహ్లీని తాము వారించామని.. స్ప్లిట్ కెప్టెన్సీ (ఫార్మాట్ కు ఒక సారథి) భారత్ కు సెట్ కాదని చెప్పినా వినకుండా  అతడు టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడని గంగూలీ  వ్యాఖ్యానించడం పెద్ద వివాదానికి దారి తీసింది.  గంగూలీ చేసిన వ్యాఖ్యలపై కోహ్లీ ఈ ఏడాది ప్రారంభంలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లేముందు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘బీసీసీఐ నుంచి నన్నెవరూ సంప్రదించలేదు. అది నా సొంత నిర్ణయం’ అని చెప్పి దాదా అబద్దాలు చెబుతున్నట్టు అతడిని బోనులో నిలబెట్టాడు. 

ఇది జరగడానికంటే కొద్దిరోజుల ముందే బీసీసీఐ.. కోహ్లీని వన్డే సారథిగా తప్పించి టెస్టులకు మాత్రమే పరిమితం చేసింది.  ఇక దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ తర్వాత కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా దీని వెనుకా బీసీసీఐ హస్తముందని  అతడి అభిమానులు వాపోయారు. కోహ్లీ వందో టెస్టు (శ్రీలంకతో మొహాలీలో) సందర్భంగా కూడా అతడిని సరిగ్గా గౌరవించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

ఈ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారింది.  కోహ్లీ-గంగూలీల వివాదంతో పాటు రోహిత్ వర్సెస్ కోహ్లీ చర్చ కూడా సాగింది. అయితే కొద్దికాలానికి రోహిత్ - కోహ్లీ వివాదం ముగిసినా  గంగూలీపై విరాట్ వీరాభిమానులు రాళ్లు విసురుతూనే ఉన్నారు. ఇక తాజాగా గంగూలీ  బీసీసీఐ బాస్ గా తప్పుకుంటుండటంతో కర్మ ఫలితాన్ని పొందుతున్నాడని  అతడి అభిమానులు  సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ‘ఎవరు ఏ కర్మ చేసుకుంటే (మంచైతే మంచి.. చెడు అయితే చెడు) వారు ఆ కర్మ ఫలాన్నే అనుభవిస్తారు..’ అనుకుంటూ  కర్మ సిద్ధాంతాన్ని బోధిస్తున్నారు. గంగూలీ తర్వాత మిగిలిపోయింది ఛేతన్ శర్మ (నేషనల్ సెలక్షన్ కమిటీ చైర్మెన్) సునీల్ గవాస్కర్ (కోహ్లీని పదే పదే విమర్శిస్తున్నందుకు) లూ త్వరలోనే కర్మ ఫలాన్ని పొందుతారని వాపోతున్నారు. 

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios