టీమిండియా మాజీ సారధి, లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ పేరు వినగానే ముందుగా ఏం గుర్తుకొస్తుంది..? ఉంగరాలు తిరిగి ఉన్న ఆయన జుట్టే గుర్తుకువస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా కనీసం హెయిర్ స్టైల్ కూడా మార్చుకుండా తన ఐకానిక్ లుక్ లో కొనసాగుతున్న కపిల్ దేవ్ సడెన్ గా అభిమానులకు షాకిచ్చారు.

కరోనా మహమ్మారి కారణంగా దేశంలో లాక్ డౌన్ సమయంలో భారత మాజీ కెప్టెన్, ప్రపంచ కప్ విజేత కపిల్ దేవ్ మేక్ఓవర్ అయ్యారు. కపిల్ దేవ్ మొత్తం గుండు చేసుకొని గడ్డం మాత్రమే ఉంచుకున్నాడు. అయితే  తన మాజీ సహచరుడు మరియు స్నేహితుడు చేతన్ శర్మ అభిమానులతో పంచుకున్న ఫోటోలలో, కపిల్ దేవ్ బ్లాక్ సూట్ ధరించి తన కొత్త రూపంలో కనిపిస్తున్నాడు. 

లెజెండరీ కపిల్ దేవ్  కొత్త రూపం అద్భుతమైనది అని చేతన్ శర్మ అన్నారు. కపిల్ దేవ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అభిమానులు అతని కొత్త రూపాన్ని వెస్టిండీస్ ఆటగాడు వివియన్ రిచర్డ్స్ తో పోల్చడం నుండి అతన్ని' లుకలైక్ థానోస్' అని సోషల్ మీడియాలో అభిమానులు తమ అభిప్రాయాన్ని వివిధ రకాలుగా వ్యక్తపరుస్తున్నారు. ‘వివ్‌ రిచర్డ్స్‌ బయోపిక్‌లో కపిల్‌ నటిస్తున్నాడా?’ అంటూ ఫ్యాన్స్‌ ఫన్నీ కామెంట్స్‌ చేశారు.

 అంతకుముందు, బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియాలో అభిమానులకు తన కొత్త రూపాన్ని చూపించారు.