విరాట్ కోహ్లీని హగ్ చేసుకుని ఎమోషనల్ అయిన జోషువా డి సిల్వ తల్లి... రెండో టెస్టులో సెంచరీతో...
సెంచరీ తర్వాత విరాట్ కోహ్లీని టీమ్ బస్సు దగ్గర కలిసిన జోషువా డి సిల్వ తల్లి... నమ్మలేకపోతున్నానంటూ ఎమోషనల్..

విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. పాకిస్తాన్, ఆస్ట్రేలియా దేశాల్లో విరాట్ ఫాలోయింగ్ చూస్తే మెంటల్ ఎక్కేస్తది. ప్రస్తుతం వెస్టిండీస్‌తో రెండో టెస్టు ఆడుతున్న విరాట్ కోహ్లీ, తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగులు చేసి కెరీర్‌లో 76వ అంతర్జాతీయ సెంచరీ అందుకున్నాడు..
విరాట్ కోహ్లీ తొలి రోజు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో విండీస్ వికెట్ కీపర్ జోషువా డి సిల్వతో జరిపిన సంభాషణ తెగ వైరల్ అయ్యింది.‘మా అమ్మ నాకు ఫోన్ చేసి నిన్న కాదు, నేను విరాట్ కోహ్లీని చూసేందుకు స్టేడియానికి వస్తానని చెప్పేసరికి షాక్ అయ్యాను. ఇప్పటికీ నేను ఆ విషయాన్ని నమ్మలేకపోతున్నా...’ అంటూ కామెంట్ చేశాడు జోషువా డి సిల్వ...
తాజాగా రెండో రోజు ఆట ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ, జోషువా డి సిల్వ తల్లి కరోలిన్ డి సిల్వని టీమ్ బస్సు దగ్గర కలుసుకున్నాడు. విరాట్ కోహ్లీని చూడగానే ప్రేమగా హత్తుకున్న ఆమె, చెంపపై ముద్దు పెట్టింది. ‘యు ఆర్ వండర్‌ఫుల్. నీకు అందమైన భార్య ఉంది..’ అంటూ చెప్పిన ఆమె మాటలను ఓపిగ్గా విన్న విరాట్ కోహ్లీ, తనతో కలిసి ఫోటోలు దిగాడు..
‘మీ అబ్బాయి, మీ గురించి చెప్పాడని’ విరాట్ కోహ్లీ, జోషువా డి సిల్వ తల్లితో అన్నాడు. విరాట్ కోహ్లీని కలిసిన ఆనందంతో ఆమె ఎమోషనల్ అయిపోయి, కన్నీళ్లు పెట్టుకోవడం కెమెరాల్లో కనిపించింది...
‘నేను జోషువాతో విరాట్ కోహ్లీని చూసేందుకు వస్తున్నానని చెప్పాను. ఎందుకంటే మా అబ్బాయిని నేను రోజూ చూస్తున్నా. విరాట్ కోహ్లీని కలవడం ఇదే మొదటిసారి. అతను అద్భుతమైన ఆటగాడు. అంతకుమించి చాలా మంచి మనసున్న మనిషి. ఎంతో టాలెంటెడ్..
విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్, ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. నా కొడుక్కి కూడా విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టం. విరాట్‌ని ఆదర్శంగా తీసుకునే క్రికెటర్‌గా మారాడు....’ అంటూ చెబుతూ ఎమోషనల్ అయ్యింది కరోలిన్ డి సిల్వ..
‘మిస్టర్ కోహ్లీని కలవడం గర్వంగా ఉంది. ఇప్పటికీ దీన్ని నమ్మలేకపోతున్నా...’ అంటూ విరాట్‌తో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది కరోలిన్ డి సిల్వ.. టెస్టుల్లో 29వ సెంచరీ అందుకున్న విరాట్ కోహ్లీ, లెజెండరీ బ్యాటర్ సర్ డాన్ బ్రాడ్‌మన్ 29 టెస్టు సెంచరీల రికార్డును సమం చేశాడు..
11 ఫోర్లతో 121 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, రనౌట్ రూపంలో పెవిలియన్ చేరాడు. రోహిత్ శర్మ 80, రవీంద్ర జడేజా 61, యశస్వి జైస్వాల్ 57, రవిచంద్రన్ అశ్విన్ 56 పరుగులు చేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకి ఆలౌట్ అయ్యింది..
రెండో రోజు ఆట ముగిసే సమయానికి 41 ఓవర్లలో వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది వెస్టిండీస్. టగెనరైన్ చంద్రపాల్ 33 పరుగులు చేసి అవుట్ కాగా క్రెగ్ బ్రాత్‌వైట్ 37, కిర్క్ మెక్‌కెంజీ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు.