ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికి ముందే ఆస్ట్రేలియా క్రికెటర్లు ఒక్కొక్కరూ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి తప్పుకుంటున్నారు. బయో బబుల్‌లో రెండు నెలల పాటు గడపడం ఇష్టం లేదంటూ సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్, ఐపీఎల్ 2021 సీజన్‌కి దూరంగా కాగా ఈ లిస్టులో మరో ఆసీస్ ప్లేయర్ చేరాడు. 

బయో బబుల్‌లో గడపడం ఇబ్బందిగా ఉందంటూ ఆసీస్ టెస్టు పేసర్ జోష్ హజల్‌వుడ్, ఐపీఎల్ 2021 సీజన్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. 

‘దాదాపు 10 నెలల నుంచి బయో బబుల్‌, క్వారంటైన్‌లో గడుపుతున్నాను. ఐపీఎల్ తర్వాత కూడా బిజీ క్రికెట్ ఆడబోతున్నాం. అందుకే ఐపీఎల్ నుంచి తప్పుకుని కుటుంబంతో గడపాలని అనుకుంటున్నా... అలాగే షీల్డ్ ఫైనల్‌కి సిద్ధంగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకుననా’ అంటూ చెప్పాడు జోష్ హజల్‌వుడ్. 

ఆసీస్ స్టార్ పేసర్ జోష్ హజల్‌వుడ్‌ను రూ.2 కోట్లకు ఐపీఎల్ 2020 వేలంలో కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. గత సీజన్‌లో 3 మ్యాచులు ఆడిన జోష్ హజల్‌వుడ్, ఒకే ఒక్క వికెట్ తీశాడు.