ప్రపంచ దిగ్గజ ఫీల్డర్, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ పవిత్ర గంగా నదిలో స్నానమాచరిస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో ఉంచాడు. ట్విట్టర్ వేదికగా తాను గంగ నదిలో మునకవేస్తున్న ఫోటోను పెట్టి.... చల్లటి గంగా నీటిలో ఇలా మునక వేయడం ఇటు ఆధ్యాత్మికంగా శారీరకంగా రెండు రకాలుగా మంచిదని అన్నాడు. 

ఈ నెల 29 నుంచి ప్రారంభమవనున్న ఐపీఎల్ సీజన్ కోసం రోడ్స్ ఇలా భారత్ కు వచ్చినట్టు సమాచారం. ఐపీఎల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కి ఫీల్డింగ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు జాంటీ రోడ్స్.

గతంలో ముంబై ఇండియన్స్ కి ఫీల్డింగ్ కోచ్ గా వ్యవహరించిన ఈ దిగ్గజ క్రికెటర్ ప్రస్తుతానికి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కి తన సేవలను అందిస్తున్నాడు. సాధారణంగా భారత దేశంతో జాంటీ రోడ్స్ కి అవినాభావ సంబంధముంది. 

Also read: ఐపిఎల్ ఫ్రాంచైజీలకు చేదు వార్త: ప్రైజ్ మనీలో సగానికి సగం కోత

భారతీయతను అమితంగా ఇష్టపడే రోడ్స్... తన కూతురికి కూడా ఇండియా అని పేరు పెట్టుకున్నాడు. భారతదేశం ఆధ్యాత్మికతతో అలరారుతుందని, అందుకే తన కూతురికి అలా ఇండియా అని పేరు పెట్టుకున్నట్టు తెలిపాడు. 

గంగలో స్నానమాచరిస్తున్న ఫోటోను రోడ్స్ పెట్టగానే హర్భజన్ సింగ్ వెంటనే స్పందించాడు. ఇండియా ను భారతీయుడినైన తనకన్నా కూడా రోడ్స్ ఎక్కువగా చూశాడని, నెక్స్ట్ టైం తనను కూడా తీసుకెళ్లాలని అన్నాడు.