బెంగళూరు: రంజీ ట్రోఫీలో టీమిండియా మాజీ పేసర్ జయదేవ్ ఉనద్కత్ 21 ఏళ్ల నాటి రికార్డును బ్రేక్ చేశాడు. తద్వారా అతను మ్యాచును గెలిపించడంతో సౌరాష్ట్ర రంజీ ట్రోఫీ పైనల్ కు చేరుకుంది. గుజరాత్ పై బుధవారం జరిగిన మ్యాచులో ఉనద్కత్ ఆ రికార్డును బద్దలు కొట్టాడు. 

సింగిల్ రంజీ ట్రోఫీ సీజన్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గా ఉనద్కత్ రికార్డులకు ఎక్కాడు. అతను 65 వికెట్లు తీసుకున్నాడు. అంతకు ముందు కర్ణాటకకు చెందిన దొడ్డ గణేష్ పేరు మీదు ఉంది. దొడ్డ గణేష్ 1998-99 సీజన్ లో ఆ రికార్డును నెలకొల్పాడు. 

 

గుజరాత్ పై పది వికెట్లు తీసుకోవడం ద్వారా జయదేవ్ ఉనద్కత్ ఆ రికార్డును నెలకొల్పాడు. రెండో ఇన్నింగ్సులో అతను 7 వికెట్లు పడగొట్టాడు. దీంతో వరుసగా సౌరాష్ట్ర రెండోసారి ఫైనల్ కు చేరుకుంది. 

రంజీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఉనద్కత్ రెండో స్థానంలో నిలిచాడు. 2018-19 సీజన్ లో 68 వికెట్లు తీసిన అశుతోష్ ఆమన్ అగ్రస్థానంలో ఉన్నాడు.

ఉనద్కత్ టీమిండియాకు 2018లో ఆడాడు. రంజీ ట్రోఫీ సీజన్ లో ఏడు సార్లు ఐదు వికెట్లు తీసిన మూడో బౌలర్ గా కూడా ఉనద్కత్ నిలిచాడు. అంతకు ముందు లక్ష్మీపతి బాలాజీ, అంకిత్ చౌదరి ఆ ఘనత సాధిచారు. 

 

రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచు బెంగాల్, సౌరాష్ట్ర మధ్య మార్చి 9వ తేదీన జరుగుతుంది. 2019 ఫైనల్ మ్యాచులో సౌరాష్ట్ర విదర్భపై ఓటమి  పాలైంది.