ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే మొదటిసారిగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ సీజన్లో ప్లేఆఫ్ కు చేరుకోలేకపోయింది. వరుస పరాజయాలతో ప్లేఆఫ్ కు చేరే అవకాశాన్ని చెన్నై జట్టు కోల్పోవడాన్ని ధోని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక మిగతా ఆటగాళ్ళ అభిమానులు కొందరు ఇక ధోని ఐపిఎల్ నుండి కూడా తప్పుకోవాలంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ సమయంలోనే చెన్నై జట్టు పరాజయంపై ధోని భార్య సాక్షి తన ఇన్స్టాగ్రామ్ లో భావోద్వేగభరిత పోస్ట్ పెట్టారు.

సాక్షి వ్యాఖ్యలు యదావిదిగా...

ఇది కేవలం ఆట మాత్రమే...
మీరు కొన్ని మ్యాచులు గెలిచారి మరికొన్ని ఓడారు!!
గడిచిపోయిన కాలం మీరు సాధించిన ఎన్నో విజయాలు కొన్ని పరాజయాలకు సాక్ష్యంగా నిలిచింది!!
కొందరికి ఆనందాన్ని మిగిల్చగా మరికొందరిని బాధించింది!!
కొందరు బాధ్యత వహించారు మరికొందరు కాదు..
కొన్ని విజయాలు... మరి కొన్ని పరాజయాలు... ఇది ఆట మాత్రమే!!
ఇందుకు బదులుగా విభిన్న రకాల స్పందనలు!
భావోద్వేగాలకు క్రీడాస్పూర్తిని దెబ్బతీసే అవకాశాన్ని ఇవ్వరాదు... ఇది కేవలం ఆట మాత్రమే!!
ఓడిపోవాలని ఎవరూ అనుకోరు కానీ అన్ని వేళలా విజయం సాధించలేరు!
మైదానాన్ని వీడే సమయంలో వినకూడని శబ్దాలు, చూడకూడని సైగలు.. 
మనోబలంతో వాటిపై పైచేయి సాధించాలి! ఇది కేవలం ఆట మాత్రమే!! 
మీరు అప్పుడు విజేతలే, ఇప్పుడు కూడా విజేతలే! 
నిజమైన యోధులు యుద్ధం చేయడం కోసమే పుడతారు.. 
వాళ్లు అభిమానుల గుండెల్లో ఎల్లప్పుడూ సూపర్‌ కింగ్స్‌ గానే ఉంటారు!!  
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

💛

A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on Oct 25, 2020 at 10:12am PDT