న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో టీమిండియా  ఘోర ఓటమికి పాలైన సంగతి తెలిసిందే. కాగా... ఈ ఓటమి పై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. బ్యాటింగ్ లో ఘెర విఫలమయ్యారంటూ ట్రోల్ చేస్తున్నారు. కాగా.. టీమిండియా ఓటమిపై తాజాగా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు బ్రాడ్ హగ్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు.

Also Read బ్యాట్‌ను తిరగేసి పట్టుకుని పరుగు పూర్తి: చివరికి రనౌట్‌కే బలి, వీడియో వైరల్...

న్యూజిలాండ్ లో టెస్టు క్రికెట్ ఆడేందుకు టీమిండియా ఇంకా ఇబ్బందులు పడుతోందని ఆయన అన్నారు. క్రైస్ట్ చర్చ్ టెస్టులో సీమింగ్ బంతుల్ని ఎలా ఎదురుకోవాలనో ఓ దారు కనుక్కోవడానికి టీమిండియా బ్యాట్సె మన్స్ కి  ఇంకా ఐదు రోజుల సమయం ఉందన్నారు. తొలి రెండు వారాలు అసలైన క్రికెట్ అంటే ఏంటో ఆడారని అన్నారు. అయితే.. తర్వాత నాలుగు వారాలు మాత్రం విహార యాత్రలు చేశారని ఎద్దేవా చేశారు.

ఇదిలా ఉండగా... తొలుత ఐదు టీ20 ల సిరీస్ లో న్యూజిలాండ్ జట్టును భారత జట్టు క్లీన్ స్వీప్ చేసింది. అదే జోష్ కంటిన్యూ  చేస్తుందని అందరూ భావించారు. అయితే.. వన్డే సిరీస్ లో టీమిండియాను కివీస్ వైట్ వాష్ చేసేసింది. ఇప్పుడు తాజాగా తొలి టెస్టులో నాలుగు రోజుల్లోనే 10 వికెట్ల తేడాతో ఓటమిపాలయ్యింది.

టెస్టు ఛాంఫియన్ షిప్ లో అగ్రగామిగా ఉన్న భారత జట్టు ఇంత ఘోరంగా ఓడిపోవడంపై అందరూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కోహ్లీకూడా స్పందించాడు. మిగిలిన మ్యాచుల్లో ఏం చేస్తుందో చూడాలి.