అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ ఇంకో 9 రోజుల్లో ప్రారంభమవనుంది. ఐపీఎల్ సమీపిస్తుండడంతో.... ఐపీఎల్ గీతాన్ని విడుదల చేసింది హాట్ స్టార్. ఈ సారి ప్రెకషకులను స్టేడియాల్లోకి అనుమతించని నేపథ్యంలో అందరూ కూడా.... టీవీలకే పరిమితమవ్వాల్సిన పరిస్థితి. 

ఈ విడుదల చేసిన ఐపీఎల్ గీతం ఇప్పుడు వివాదాస్పదమైంది. తాను మూడు సంవత్సరాల కింద విడుదల చేసిన "దేఖ్ కౌన్ ఆయా వాపస్" ను కాపీ కొట్టి "హమ్ ఆయేంగే వాపస్" అంటూ గీతాన్ని విడుదల చేసారని ర్యాపర్ కృష్ణ కౌల్ ఆరోపించాడు. 

ఈ విషయాన్నీ సోసివల్ మీడియా వేదికగా ప్రకటించిన కృష్ణ కు అనేక మంది మ్యూజిక్ కంపోజర్లు మద్దతుగా నిలిచారు. ఇంత జరుగుతున్నప్పటికీ... ఐపీఎల్ మాత్రం ఇది కాపీ కాదు అని వాదిస్తుంది. మరో పక్క బీసీసీఐ ఏమో తమకు ఎటువంటి కంప్లైంట్ రాలేదు అని అంటుంది. 

ఒక కళాకారుడి పాటను వాడుకున్నప్పుడు కనీసం గుర్తింపు కూడా ఇవ్వకుండా ఇలా కాపీ కొట్టడం ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మూడు రోజుల కిందే ఈ సంఘటన జరిగినప్పటికీ.... నేడు ఇది సోషల్ మీడియాలో విపరీతంగా టెరెన్డ్ అవుతుంది. 

హాట్ స్టార్ ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సిందే అని హిప్ హాప్ కళాకారులూ పట్టుబడుతున్నారు. ఎందరో మ్యూజిక్ లవర్స్ సైతం జరిగిన అన్యాయం గురించి వాపోతున్నారు. గుర్తింపు తక్కువగా ఉన్న కళాకారుడి పాటను దొంగిలించి వాడుకోవడానికి సిగ్గుగా లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు.