రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2021 టోర్నీలో ఆడిన మరో ప్లేయర్‌కి కూడా కరోనా సోకింది. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్, తనకి కరోనా పాజిటివ్ వచ్చినట్టు పేర్కొన్నాడు. దీంతో రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో పాల్గొని కరోనా బారిన పడిన మాజీ క్రికెటర్ల సంఖ్య నాలుగుకి చేరింది. 

రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టోర్నీ విజేతగా నిలిచిన ఇండియా లెజెండ్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన సచిన్ టెండూల్కర్ మొదట కరోనా బారిన పడ్డారు. ఆ తర్వాత టీమిండియా మాజీ క్రికెటర్లు బద్రీనాథ్, యూసఫ్ పఠాన్ కూడా కరోనా పాజిటివ్ తెలియచేశారు.

యూసఫ్ పఠాన్ సోదరుడైన ఇర్ఫాన్ పఠాన్ కూడా కరోనా బారిన పడడంతో రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో తీసుకున్న కరోనా జాగ్రత్తల గురించి చర్చ జరుగుతోంది. అయితే రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో పాల్గొన్న విదేశీ క్రికెటర్లు మాత్రం ఇప్పటిదాకా కరోనా బారిన పడినట్టు నిర్ధారణ కాలేదు...