Asianet News TeluguAsianet News Telugu

ముంబయి వర్సెస్‌ బెంగళూరు‌ ఫాంటసీ గేమ్‌ డ్రీమ్‌ టీమ్‌

ముంబయి ఇండియన్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ జట్లలోని బిగ్‌ హిట్టర్లతో పాటు ఫామ్‌లో ఉన్న యువ క్రికెటర్లు జట్టులో ఉండేలా చూసుకోవాలి

IPL2020 : MI VS RCB, Dream Team For Fantasy Leagues
Author
Hyderabad, First Published Sep 28, 2020, 3:05 PM IST

ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ నేటి సాయంత్రం జరగనుంది. ఈ మ్యాచ్ కు సంబంధించి ఫాంటసీ గేమ్ డ్రీం టీం మీ కోసం. 

ముంబయి ఇండియన్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ జట్లలోని బిగ్‌ హిట్టర్లతో పాటు ఫామ్‌లో ఉన్న యువ క్రికెటర్లు జట్టులో ఉండేలా చూసుకోవాలి.

డ్రీమ్‌ టీమ్‌:

వికెట్‌ కీపర్‌: క్వింటన్‌ డికాక్‌
బ్యాట్స్‌మెన్‌: రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, విరాట్‌ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌.
ఆల్‌రౌండర్లు: కీరన్‌ పొలార్డ్‌, హార్ధిక్‌ పాండ్య
బౌలర్లు : యుజ్వెంద్ర చాహల్‌, నవదీప్‌ సైని, జశ్‌ప్రీత్‌ బుమ్రా, రాహుల్‌ చాహర్‌.
 కెప్టెన్‌: రోహిత్‌ శర్మ
వైస్‌ కెప్టెన్‌:  విరాట్‌ కోహ్లి

సబ్‌స్టిట్యూట్స్‌ : శివం దూబె, అరోన్‌ ఫించ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, జేమ్స్‌ పాటిన్సన్‌. (గాయం కారణంగా క్రిస్‌ మోరీస్‌ అందుబాటులో ఉండే అవకాశం లేదు. మోరీస్‌ ఫిట్‌నెస్‌ సాధించి తుది జట్టులోకి వస్తే ఆల్‌రౌండర్ల జాబితాలో క్రిస్‌ మోరీస్‌ను ఎంచుకోవచ్చు)

ఈ జట్టే ఎందుకు?

కెప్టెన్‌: రోహిత్‌ శర్మఫామ్‌లోకి వచ్చాడు. కోల్‌కత నైట్‌రైడర్స్‌పై 54 బంతుల్లో 80 పరుగులు బాదాడు. ఫామ్‌లో ఉంటే రోహిత్‌ శర్మను ఆపగలిగే బౌలర్‌ లేడు. ఆత్మవిశ్వాసం కొరవడిన బెంగళూర్‌పై రోహిత్‌ మరింత ప్రమాదకర బ్యాట్స్‌మన్‌ కాగలడు. 2017 నుంచి బెంగళూర్‌పై రోహిత్‌ శర్మ స్ర్టయిక్‌ రేట్‌ 156.94. బెంగళూర్‌పై రోహిత్‌ సగటు 45.20. లయ తప్పిన బెంగళూర్‌ బౌలింగ్‌పై రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా అత్యధిక పాయింట్లు తేగలడు.

వైస్‌ కెప్టెన్‌: ఐపీఎల్‌ ఆరంభంలో పరుగుల వేటలో ఇబ్బందిపడిన చరిత్ర విరాట్‌ కోహ్లికి లేదు. తొలి రెండు మ్యాచుల్లో విరాట్‌ విఫలమయ్యాడు. కానీ భారీ ఇన్నింగ్స్‌కు విరాట్‌ అతి చేరువలో ఉన్నాడు. గత మ్యాచ్‌లో కోహ్లి నం.4కు డిమోట్‌ చేసుకున్నాడు. నేడు తిరిగి నం.3 పొజిషన్‌లోనే బ్యాటింగ్‌కు రానున్నాడు. ఈ స్థానంలో 2017 నుంచి ముంబయిపై 35.07 సగటు, 132.17 స్ర్టయిక్‌రేట్‌తో కోహ్లి 456 పరుగులు చేశాడు.  

సూర్యకుమార్‌: గత కొన్ని సీజన్లుగా సూర్యకుమార్‌ యాదవ్‌ నిలకడగా ఆడుతున్నాడు. పవర్‌ ప్లేలో సూర్యకుమార్‌ బౌండరీలు బాదే సామర్థ్యం 77.43 శాతంతో నిలకడగా ఉంది. 2018 నుంచి సూర్యకుమార్‌ 30 మ్యాచుల్లో 15 సార్లు 30 ప్లస్‌ పరుగులు చేశాడు. అందులో ఆరు అర్థ సెంచరీలు ఉన్నాయి.

డికాక్‌: 2019 ఐపీఎల్‌లో ముంబయి తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌ డికాక్‌. 2018 సీజన్‌ నుంచి పవర్‌ ప్లలో డికాక్‌ స్ట్రయిక్‌ రేట్‌ 131.96. యుఏఈలో సత్తా చాటేందుకు డికాక్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. అదే సమయంలో పవర్‌ ప్లేలో బెంగళూర్‌ ఎకానమి 8.36 పరుగులు.

ఏబీ డివిలియర్స్‌: అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనా, ఏబీ డివిలియర్స్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు. బంతిపై స్పష్టమైన ఆధిపత్యం చూపిస్తున్నాడు. 2018 నుంచి ముంబయిపై డివిలియర్స్‌ సగటు 73. ముంబయిపై చివరి రెండు మ్యాచుల్లో ఏబీ డివిలియర్స్‌ అర్థ సెంచరీలు సాధించాడు.

లాజికల్‌ పిక్స్‌: లెగ్‌ స్పిన్‌కు నిలకడగా వికెట్లు కోల్పోవటం బెంగళూర్‌ బలహీనత. 2018 సీజన్‌ నుంచి లెగ్‌ స్పిన్‌కు బెంగళూర్‌ 42 వికెట్లు కోల్పోయింది. పంజాబ్‌తో చివరి మ్యాచ్‌లోనూ బెంగళూర్‌ ఆరు వికెట్లు లెగ్‌ స్పిన్‌కు కోల్పోయింది. ముంబయి లెగ్‌ స్పిన్నర్‌ రాహుల్‌ చాహర్‌  7.75 ఎకానమితో మూడు వికెట్లు తీశాడు. నేటి మ్యాచ్‌లో రాహుల్‌ చాహర్‌ డ్రీమ్‌ టీమ్‌లో ఎక్స్‌ ఫ్యాక్టర్‌ కాగలడు.

ఇవీ కీలకం!:

1. దుబాయ్‌లో ఇక్కడి వరకు జరిగిన మ్యాచుల్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్లే విజయం సాధించాయి. అందుకే డ్రీమ్‌ టీమ్‌ కెప్టెన్‌ తొలి ఇన్నింగ్స్‌ నుంచి ఎంచుకోవటం మంచిది.
2. రాయల్‌ చాలెంజర్స్‌ రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌ చేస్తే మణికట్టు మాయగాడు యుజ్వెంద్ర చాహల్‌ కీలకం అవుతాడు. ఈ పరిస్థితుల్లో చాహల్‌ను వైస్‌ కెప్టెన్‌గా ఎంచుకోవటం తెలివైన ఎంపిక కాగలదు.
3. 2017 నుంచి టీ20ల్లో ఫించ్‌కు బుమ్రా 29 బంతులు సంధించి, 35 పరుగులు ఇచ్చి.. రెండుసార్లు అవుట్‌ చేశాడు. ఈ సారి బుమ్రా ఫోబియోను అరోన్‌ ఫించ్‌ను అధిగమించగలడు అనుకుంటే హార్ధిక్‌ పాండ్య స్థానంలో అరోన్‌ ఫించ్‌ను ఎంచుకోవచ్చు. పాండ్య ప్రస్తుతం బ్యాట్స్‌మన్‌గా ఆడుతున్నాడు, బంతి అందుకునేందుకు ఇంకా సమయం పట్టవచ్చు.

- శ్రీనివాస్ దాస్ మంతటి

Follow Us:
Download App:
  • android
  • ios