Asianet News TeluguAsianet News Telugu

కెప్టెన్సీ మారినా దక్కని విజయం.. ఓటమిపై కేన్ విలయమ్సన్ ఏమన్నాడంటే..

అటు బౌలింగ్‌లోనూ ఇటు బ్యాటింగ్‌లోనూ తేలిపోయిన సన్‌రైజర్స్‌ 55 పరుగుల తేడాతో ఓటమి చెందింది. ఆరెంజ్‌ ఆర్మీలో ఏ ఒక్కరూ హాఫ్‌ సెంచరీ చేయకపోవడంతో 221 పరుగుల  టార్గెట్‌కు కనీసం సమీపంలోకి కూడా రాలేకపోయింది.

IPL Kane Williamson says 'all cards on the table' after Sunrisers hyderabad dropped david warner
Author
Hyderabad, First Published May 3, 2021, 12:26 PM IST

ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ వరస పరాజయాలను మూటగట్టుకుంటోంది. వరస పరాజయాలకు బాధ్యుడిని చేస్తూ.. వార్నర్ ని  తొలగించి.. కెప్టెన్సీ బాధ్యతలను కేన్ విలయమ్సన్ కి అప్పగించారు. కెప్టెన్సీ మారినా.. జట్టు ఫేట్ మారలేదు.

రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్‌ హైదరాబాద్‌ ఘోర పరాజయం చవిచూసింది. అటు బౌలింగ్‌లోనూ ఇటు బ్యాటింగ్‌లోనూ తేలిపోయిన సన్‌రైజర్స్‌ 55 పరుగుల తేడాతో ఓటమి చెందింది. ఆరెంజ్‌ ఆర్మీలో ఏ ఒక్కరూ హాఫ్‌ సెంచరీ చేయకపోవడంతో 221 పరుగుల  టార్గెట్‌కు కనీసం సమీపంలోకి కూడా రాలేకపోయింది.


మ్యాచ్‌ తర్వాత అవార్డుల కార్యక్రమంలో సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. భారీ టార్గెట్‌ ముందున్నప్పుడు వికెట్లు కోల్పోతే ఛేజ్‌ చేయడం చాలా కష్టమన్నాడు. ‘ఇది మాకు బ్యాడ్‌ డే. రాజస్థాన్‌ రాయల్స్‌ కాంపిటేటివ్‌ స్కోరు ఉంచింది. ఇది జోస్‌(బట్లర్‌) రోజు. అసాధారమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. గత మూడు వారాల నుంచి మాకు వరుస చాలెంజ్‌లు ఎదురవుతూనే ఉన్నాయి.

ఫెర్ఫారెన్స్‌ను మెరుగుపరుగుచుకోవడానికి చిన్న చిన్న మార్పులు అవసరం. మా తప్పిదాలను సరిచేసుకుని ముందుకు వెళతాం. ప్రతీరోజూ మాకు ఏమి అవసరమో అది క్లియర్‌ చేసుకోవాలి.,మాకున్న వనరులను సద్వినియోగం చేసుకోవాల్సి ఉంది. అలాగే ఒక నిర్ణయం తీసుకున్నాం. రాజస్ధాన్‌ బ్యాటింగ్‌కు హ్యాట్సాఫ్‌’ అని తెలిపాడు.

ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటింగ్‌లో మనీష్‌ పాండే 31, బెయిర్‌ స్టో 30, విలియమ్సన్‌ 20 పరుగులు సాధించారు. రాజస్తాన్‌ బౌలర్లలో ముస్తాఫిజుర్‌, మోరిస్‌లు చెరో 3 వికెట్లు తీయగా.. త్యాగి, తెవాటియాలు చెరో వికెట్‌ తీశారు. అంతకుముందు రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ అద్భుత సెంచరీతో మెరిశాడు.  64 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లు సాయంతో 124 పరుగులు చేశాడు. దాంతో రాజస్థాన్‌ 220 పరుగుల స్కోరు చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios