11:25 PM (IST) Jun 03

IPL 2025 Final RCB vs PBKS Liveఐపీఎల్ 2025 ఛాంపియన్ ఆర్సీబీ

IPL 2025 Prize money: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సూపర్ విక్టరీతో కొత్త ఛాంపియన్ గా నిలిచింది. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ రజత్ పాటిదార్ ఆర్సీబీకి తొలి ఐపీఎల్ ట్రోఫీని అందించాడు.

11:15 PM (IST) Jun 03

IPL 2025 Final RCB vs PBKS Live7వ వికెట్ కోల్పోయిన పంజాబ్.. ఓమర్జాయ్ అవుట్

IPL 2025 Final RCB vs PBKS Live: పంజాబ్ కింగ్స్ 7వ వికెట్ కోల్పోయింది. ఓవర్జాయ్ 1 పరుగు చేసి అవుట్ అయ్యాడు.

పంజాబ్ కింగ్స్: 146/7 (17.3 ఓవర్లు)

11:11 PM (IST) Jun 03

IPL 2025 Final RCB vs PBKS Liveడబుల్ ధమాకా.. 6వ వికెట్ కోల్పోయి కష్టాల్లో పడ్డ పంజాబ్.. వధేరా, స్టోయినీస్ అవుట్

IPL 2025 Final RCB vs PBKS Live: పంజాబ్ కింగ్స్ 6వ వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. 16.2 ఓవర్ల వద్ద నేహల్ వధేరా 15 పరుగుల వద్ద 5వ వికెట్ గా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన స్టోయినీస్ సిక్సర్ బాది తర్వాత బంతికి క్యాచ్ గా అవుట్ అయ్యాడు. పంజాబ్ కింగ్స్142 పరుగులతో ఆడుతోంది. భువనేశ్వర్ తన ఓవర్ లో రెండు వికెట్లు తీసుకున్నాడు.

11:02 PM (IST) Jun 03

IPL 2025 Final RCB vs PBKS Liveఅదరగొడుతున్న ఆర్సీబీ బౌలర్లు: పంజాబ్ 119/4 పరుగులు

IPL 2025 Final RCB vs PBKS Live: పంజాబ్ కింగ్స్ 15 ఓవర్లు పూర్తయ్యే సరికి 119-4 పరుగులు చేసింది.

పంజాబ్ కింగ్స్: 119/4 (15 ఓవర్లు)

శశాంక్ సింగ్ 9(10)

నేహల్ వధేరా 13(14)

10:45 PM (IST) Jun 03

IPL 2025 Final RCB vs PBKS Liveనాల్గో వికెట్ కోల్పోయిన పంజాబ్.. జోష్ ఇంగ్లీస్ అవుట్

IPL 2025 Final RCB vs PBKS Live: పంజాబ్ కింగ్స్ నాల్గో వికెట్ కోల్పోయింది. జోష్ ఇంగ్లీస్ పాండ్య బౌలింగ్ లో క్రీజు లైన్ వద్ద లివింగ్ స్టోన్ కు క్యాచ్ రూపంలో దొరికాడు. 39 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. 

పంజాబ్ కింగ్స్: 98/4 (12.3 ఓవర్లు)

10:32 PM (IST) Jun 03

IPL 2025 Final RCB vs PBKS Liveబిగ్ వికెట్: శ్రేయాస్ అయ్యర్ అవుట్.. పంజాబ్ 79/3 పరుగులు

IPL 2025 Final RCB vs PBKS Live: పంజాబ్ కింగ్స్ బిగ్ వికెట్ కోల్పోయింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 1 పరుగుకే అవుట్ అయ్యాడు. షెఫర్డ్ బౌలింగ్ లో క్యాచ్ రూపంలో జితేష్ శర్మకు చిక్కాడు.

పంజాబ్ కింగ్స్: 79/3 (9.4 ఓవర్లు)

జోష్ ఇంగ్లీస్ 23* పరుగులు

10:26 PM (IST) Jun 03

IPL 2025 Final RCB vs PBKS Liveప్రభ్ సిమ్రాన్ సింగ్ అవుట్: పంజాబ్ 72/2 పరుగులు

IPL 2025 Final RCB vs PBKS Live: పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. ప్రభ్ సిమ్రాన్ సింగ్ 26 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. పాండ్యా బౌలింగ్ లో భువనేశ్వర్ కు క్యాచ్ రూపంలో దొరికిపోయాడు.

పంజాబ్ కింగ్స్: 72/2 (8.3 ఓవర్లు)

జోష్ ఇంగ్లీస్ 17* పరుగులు

10:11 PM (IST) Jun 03

IPL 2025 Final RCB vs PBKS Liveపవర్ ప్లే పూర్తయ్యే సరికి పంజాబ్ 52/1 పరుగులు

IPL 2025 Final RCB vs PBKS Live: పంజాబ్ కింగ్స్ పవర్ ప్లే పూర్తయ్యే సరికి ఒక వికెట్ కోల్పోయి 52 పరుగులు చేసింది.

పంజాబ్ కింగ్స్: 52/1 (6 ఓవర్లు)

ప్రభ్ సిమ్రాన్ సింగ్ 24* పరుగులు

జోష్ ఇంగ్లీస్ 8* పరుగులు

10:05 PM (IST) Jun 03

IPL 2025 Final RCB vs PBKS Liveఫిల్ సాల్ట్ సూపర్ క్యాచ్: ప్రియాంష్ ఆర్య అవుట్.. పంజాబ్ 43/1 (5 ఓవర్లు) పరుగులు

IPL 2025 Final RCB vs PBKS Live: పంజాబ్ కింగ్స్ 5 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 43 పరుగులు చేసింది. జోష్ హేజిల్ వుడ్ బౌలింగ్ లో బిగ్ షాట్ ఆడి ప్రియాంష్ ఆర్య 24 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. అతను బౌండరీ లైన్ వద్ద అద్భుతమైన క్యాచ్ గా సాల్ట్ కు దొరికిపోయాడు.

పంజాబ్ కింగ్స్: 43/1 (5 ఓవర్లు)

ప్రభ్ సిమ్రాన్ సింగ్ 15* పరుగులు

Scroll to load tweet…

09:49 PM (IST) Jun 03

IPL 2025 Final RCB vs PBKS Liveఫోర్ తో పంజాబ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టిన ప్రియాంష్ ఆర్య

IPL 2025 Final RCB vs PBKS Live: ఆర్సీబీ ఉంచిన 191 పరుగులు టార్గెట్ ను అందుకోవడంలో పంజాబ్ కింగ్స్ కు మంచి ఆరంభం లభించింది. పంజాబ్ ఇన్నింగ్స్ ను ప్రియాంష్ ఆర్య ఫోర్ తో ఆరంభించాడు. 

పంజాబ్ స్కోర్: 23/0 (2)

ప్రియాంష్ ఆర్య 11* పరుగులు 

ప్రభ్ సిమ్రాన్ సింగ్ 8* పరుగులు

09:32 PM (IST) Jun 03

IPL 2025 Final RCB vs PBKS Liveపంజాబ్ ముందు 191 పరుగుల టార్గెట్.. ఆర్సీబీ స్కోర్ బోర్డు అప్డేట్

IPL 2025 Final RCB vs PBKS Live: ఆర్సీబీ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. పంజాబ్ ముందు 191 పరుగుల టార్గెట్ ను ఉంచింది. 

ఆర్సీబీ బ్యాటింగ్: 

విరాట్ కోహ్లీ 43 పరుగులు

పాటిదార్ 26 

అగర్వాల్ 24

లివింగ్ స్టోన్ 25 

జితేష్ శర్మ 24

పంజాబ్ బౌలింగ్:

అర్షదీప్ సింగ్ 3 వికెట్లు 

జేమీసన్ 3 వికెట్లు

09:25 PM (IST) Jun 03

IPL 2025 Final RCB vs PBKS Liveఅర్షదీప్ సూపర్ బౌలింగ్.. చివరి ఓవర్ లో 3 రన్స్ 3 వికెట్లు.. ఆర్సీబీ 190/9 (20 ఓవర్లు)

IPL 2025 Final RCB vs PBKS Live: ఫైనల్ ఓవర్ ను అర్షదీప్ సింగ్ అద్భుతంగా వేశాడు. కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. 20వ ఓవర్ లో తన బౌలింగ్ లో షెఫర్డ్, పాండ్యా, భువనేశ్వర్ కుమార్ లను అవుట్ చేశాడు.

ఆర్సీబీ: 190/9 (20 ఓవర్లు)

09:11 PM (IST) Jun 03

IPL 2025 Final RCB vs PBKS Liveజితేష్ శర్మ అవుట్.. ఆర్సీబీ 171/6 పరుగులు (17.4 ఓవర్లు)

IPL 2025 Final RCB vs PBKS Live: ఆర్సీబీ 6వ వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న జితేష్ శర్మ వైశాఖ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. జితేష్ 10 బంతుల్లో 24 పరుగుల ఇన్నింగ్స్ లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు.

ఆర్సీబీ: 171/6 (17.4 ఓవర్లు)

09:06 PM (IST) Jun 03

IPL 2025 Final RCB vs PBKS Liveవరుస సిక్సర్లు బాదిన లివింగ్ స్టోన్ అవుట్.. 167/5 (16.5 ఓవర్లు)

IPL 2025 Final RCB vs PBKS Live: ఆర్సీబీ ఐదో వికెట్ కోల్పోయింది. వరుసగా 3 భారీ సిక్సర్లు వచ్చిన ఈ ఓవర్ లో లివింగ్ స్టోన్ 25 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. జేమీసన్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు.

ఆర్సీబీ: 167/5 (16.5 ఓవర్లు)

08:50 PM (IST) Jun 03

IPL 2025 Final RCB vs PBKS Liveవిరాట్ కోహ్లీ అవుట్.. ఆర్సీబీ 14.5 ఓవర్లలో 131/4 పరుగులు

IPL 2025 Final RCB vs PBKS Live: ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. విరాట్ కోహ్లీ 43 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. కోహ్లీ ఓమర్జాయ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. కోహ్లీ తన ఇన్నింగ్స్ లో 3 ఫోర్లు కొట్టాడు.

ఆర్సీబీ: 131/4 (14.5 ఓవర్లు)

లివింగ్ స్టోన్ : 16* పరుగులు 

08:30 PM (IST) Jun 03

IPL 2025 Final RCB vs PBKS Live100 పరుగులు పూర్తి చేసిన ఆర్సీబీ

IPL 2025 Final RCB vs PBKS Live: ఆర్సీబీ 11.3 ఓవర్లలో 100 పరుగుల పూర్తి చేసింది.

ఆర్సీబీ: 103/3 (12 ఓవర్లు)

కోహ్లీ 32* పరుగులు

లివింగ్ స్టోన్ 3* పరుగులు 

08:28 PM (IST) Jun 03

IPL 2025 Final RCB vs PBKS LiveIPL 2025 Final RCB vs PBKS Live: మూడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ.. కెప్టెన్ రజత్ పాటిదార్ అవుట్

IPL 2025 Final RCB vs PBKS Live: ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ రజత్ పాటిదార్ 26 పరుగుల వద్ద జేమీసన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.

ఆర్సీబీ 96/3 (10.5 ఓవర్లు)

08:24 PM (IST) Jun 03

IPL 2025 Final RCB vs PBKS LiveIPL 2025 Final RCB vs PBKS Live: 10 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 88/2

IPL 2025 Final RCB vs PBKS Live: ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ లో 10 ఓవర్ల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్కోర్ 87/2 (10)

రజత్ పాటిదార్ 18(12)

విరాట్ కోహ్లీ 27(21

08:06 PM (IST) Jun 03

IPL 2025 Final RCB vs PBKS LiveIPL 2025 Final RCB vs PBKS Live: ఆర్సీబీ రెండో వికెట్ డౌన్.. మయాంక్ అగర్వాల్ అవుట్

IPL 2025 Final RCB vs PBKS Live: పవర్ ప్లే ముగిసిన తర్వాతి బంతికే ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది.

మయాంక్ అగర్వాల్ 24 (18) అవుట్ అయ్యాడు. చాహల్ తన తొలి ఓవర్ రెండో బంతికి మయాంక్ ను అవుట్ చేశాడు. 

ఆర్సీబీ స్కోర్: 56/2 ( 6.2 ఓవర్లు)

08:01 PM (IST) Jun 03

IPL 2025 Final RCB vs PBKS LiveIPL 2025 Final RCB vs PBKS Live: పవ‌ర్ ప్లే త‌ర్వాత ఆర్సీబీ స్కోర్ 55/1 (6 ఓవర్లు)

IPL 2025 Final RCB vs PBKS Live: ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ లో పవర్ ప్లే ముగిసే సరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక వికెట్ కోల్పోయి 55 పరుగులు చేసింది.

ఆర్సీబీ స్కోర్: 55/1 (6 ఓవర్లు)

విరాట్ కోహ్లీ 13 (10)

మయాంక్ అగర్వాల్ 24 (17)