IPL 2023 ఆరంభ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా హీరోయిన్లు తమన్నా భాటియా, రష్మిక మంధాన.. ఐపీఎల్ వేదికపై తెలుగు పాటల సందడి..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2023) సీజన్ ఘనంగా ఆరంభమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఆరంభ వేడుకలు క్రికెట్ ఫ్యాన్స్‌ని విశేషంగా ఆకట్టుకున్నాయి. దాదాపు లక్ష మంది క్రికెట్ ఫ్యాన్స్‌‌తో మొదటి మ్యాచ్ జరుగుతున్న స్టేడియంలో నిండిపోయింది...

భారత సింగర్, మ్యూజిక్ కంపోజర్ అరిజిత్ సింగ్ మ్యూజిక్‌ కచేరీతో ఐపీఎల్ 2023 ఆరంభ వేడుకలు ప్రారంభమయ్యాయి. బాలీవుడ్ రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘పఠాన్’ మూవీలోని ‘జూమే జో పఠాన్’ పాటతో పాటు మెలోడీ సాంగ్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు అరిజిత్ సింగ్... 

Scroll to load tweet…

అరిజిత్ సింగ్ మ్యూజిక్ లైవ్ షో ముగిసిన తర్వాత తమన్నా భాటియా డ్యాన్స్‌లతో స్టేడియం దద్దరిల్లిపోయింది. ఆ తర్వాత స్టేజీ మీదకి వచ్చిన ‘నేషనల్ క్రష్’ రష్మిక మంధాన, యాంకర్‌లా ప్రేక్షకులతో మాట్లాడి, వాళ్ల అటెన్షన్ కొట్టేసింది..

Scroll to load tweet…

ఆ తర్వాత తన ట్రేడ్ మార్క్ ‘సామీ సామీ’ స్టెప్పులతో మొదలెట్టిన రష్మిక మంధాక, ‘పుష్ఫ’ హిందీ వర్షన్ ‘శ్రీవల్లీ’ పాటకు చిందులేసింది... తమన్నా ఓ తెలుగు పాటను ఎంచుకుంటే రష్మిక, ఆస్కార్ విన్నింగ్ ‘నాటు నాటు’ సాంగ్‌కి తన స్టైల్‌లో ఇరగదీసింది. డ్యాన్స్ ప్రోగ్రామ్ ముగిసిన తర్వాత మొదటి మ్యాచ్ ఆడుతున్న ఇద్దరు కెప్టెన్లను ప్రత్యేకంగా స్టేజీ మీదకి తీసుకొచ్చారు నిర్వహాకులు. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, ఐపీఎల్ 2023 ట్రోఫీని స్టేజీ మీదకి తీసుకొచ్చాడు...

Scroll to load tweet…

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, హార్ధిక్ పాండ్యా కలిసి ట్రోఫీతో ఫోటోలకు ఫోజిచ్చారు. నేటి మ్యాచ్‌తో మొదలయ్యే ఐపీఎల్ 2023 సీజన్, మే 28 వరకూ నిర్విరామంగా రెండు నెలల పాటు క్రికెట్ ఫ్యాన్స్‌ని ఊర్రూతలూగించనుంది.. గత సీజన్‌తో పోలిస్తే ఈసారి ఐపీఎల్‌లో కొన్ని రూల్స్‌ అమలులోకి తేవడంతో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి...