Asianet News TeluguAsianet News Telugu

ఐపీఎల్‌ రికార్డు బ్రేక్... రికార్డు ధర దక్కించుకున్న సామ్ కుర్రాన్...

IPL 2022 Mini Auction: రూ.18 కోట్ల 50 లక్షల భారీ ధర దక్కించుకున్న సామ్ కుర్రాన్... విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ రికార్డులు బ్రేక్.. 

IPL 2023 Mini Auction: Sam Curran breaks IPL highest bid player in history
Author
First Published Dec 23, 2022, 3:27 PM IST

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్ ఇంగ్లాండ్ యంగ్ ఆల్‌రౌండర్ సామ్ కుర్రాన్ రికార్డు క్రియేట్ చేశాడు. ఇంతవరకూ 2021 వేలంలో రూ.16.25 కోట్లు దక్కించుకున్న క్రిస్ మోరిస్ రికార్డును బ్రేక్ చేసిన సామ్ కుర్రాన్, రూ.18.50 కోట్లకు పంజాబ్ కింగ్స్‌కి అమ్ముడుపోయాడు...  

ఇంతవరకూ ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్... ఐపీఎల్‌లో అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్లుగా ఉన్నారు. వారి రికార్డును కూడా బ్రేక్ చేసేశాడు సామ్ కుర్రాన్. విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ రూ.17 కోట్లు తీసుకోగా, సామ్ కుర్రాన్‌ ఏకంగా రూ.18.5 కోట్లు తీసుకోబోతున్నాడు...

ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సామ్ కుర్రాన్ కోసం ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు పోటీపడ్డాయి. ఫ్రాంఛైజీలు ఏ మాత్రం ఆలోచించకుండా బిడ్డింగ్ వేస్తూ పోవడంతో 2 నిమిషాల్లోనే రూ.10 కోట్ల ప్రైజ్ దాటేశాడు సామ్ కుర్రాన్...

పర్సులో రూ.20 కోట్లు కూడా లేని చెన్నై సూపర్ కింగ్స్, సామ్ కుర్రాన్ కోసం రూ.15.25  కోట్ల వరకూ బిడ్ చేసింది.ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ టీమ్, కుర్రాన్ కోసం పోటీకి వచ్చింది. 

సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ కేన్ విలియంసన్‌ని బేస్ ప్రైజ్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్. గత ఏడాది సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా రూ.14 కోట్లు తీసుకున్న కేన్ విలియంసన్, ఈ సీజన్‌లో రూ.2  కోట్లకు గుజరాత్ తరుపున ఆడబోతున్నాడు...

ఇంగ్లాండ్ యంగ్ సెన్సేషన్ హారీ బ్రూక్ కోసం ఫ్రాంఛైజీలన్నీ పోటీపడ్డాయి. రూ.10 కోట్లు దాటిన తర్వాత రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు హారీ బ్రూక్ కోసం పోటీపడడంతో ధర అంతకంతకూ పెరుగుతూపోయింది. చివరికి రూ.13 కోట్ల 25 లక్షల భారీ మొత్తానికి హారీ బ్రూక్‌ని కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్.. 

భారత బ్యాట్స్‌మెన్ మయాంక్ అగర్వాల్‌ని రూ.8.25 కోట్లకు కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్..  భారత టెస్టు ప్లేయర్ అజింకా రహానేని రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్... ఇంగ్లాండ్ మాజీ టెస్టు కెప్టెన్ జో రూట్‌ని ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించలేదు...  సౌతాఫ్రికా బ్యాటర్ రిలే రసో కూడా తొలి రౌండ్‌లో అమ్ముడుపోలేదు.. బేస్ ప్రైజ్ రూ.1.5 కోట్లతో వేలానికి వచ్చిన బంగ్లా ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ అమ్ముడుపోలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios