Asianet News TeluguAsianet News Telugu

పూర్ రికార్డున్న పూరన్‌కి బంపర్ ఆఫర్... భారీ ధర దక్కించుకున్న విండీస్ బ్యాటర్..

రూ.16 కోట్లకు నికోలస్ పూరన్‌ని దక్కించుకున్న లక్నో సూపర్ జెయింట్స్... గత రెండు సీజన్లలలో అట్టర్ ఫ్లాప్ అయిన వెస్టిండీస్ బ్యాటర్... 

IPL 2023 Mini Auction: Nicholas Pooran gets huge price after two utterflop seasons
Author
First Published Dec 23, 2022, 4:15 PM IST

బంగ్లా బ్యాటర్ లిటన్ దాస్‌ని బేస్ ప్రైజ్ రూ.50 లక్షలకు కొనుగోలు చేయడానికి ఏ జట్టూ ఆసక్తి చూపించలేదు. గత రెండు సీజన్లలో అట్టర్ ఫ్లాప్ అయినా వెస్టిండీస్ హిట్టర్ నికోలస్ పూరన్‌ని దక్కించుకోవడానికి ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ పోటీపడ్డాయి.. ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ కూడా రేసులోకి వచ్చింది...

2021 సీజన్‌లో నాలుగు సార్లు డకౌట్ అయి 85 పరుగులు మాత్రమే చేసిన నికోలస్ పూరన్‌ను, గత సీజన్‌లో రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. గత సీజన్‌లో 14 మ్యాచుల్లో 306 పరుగులు చేసిన పూరన్‌ని మినీ వేలానికి వదిలేసింది ఆరెంజ్ ఆర్మీ...

లక్నో సూపర్ జెయింట్స్ రూ.16 కోట్లకు నికోలస్ పూరన్‌ని దక్కించుకుంది. పూరన్‌ని రూ.10 కోట్లకు కొనడమే వేస్ట్ అని వాదించిన గౌతమ్ గంభీర్ మెంటర్‌గా ఉన్న లక్నో, అతని కోసం రూ.16 కోట్లు పెట్టడం విశేషం.. 

హెన్రీచ్ క్లాసిన్‌ని రూ.5 కోటి 25 లక్షలకు కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు. ఫిలిప్ సాల్ట్‌ని బేస్ ప్రైజ్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు. శ్రీలంక వికెట్ కీపర్ కుశాల్ మెండీస్, రూ.50 లక్షల బేస్ ప్రైజ్‌తో వేలానికి వచ్చి అమ్ముడుపోలేదు. అలాగే ఇంగ్లాండ్ వికెట్ కీపర్ టామ్ బంటన్ కూడా రూ.2 కోట్లతో వేలానికి వచ్చి అమ్ముడుపోలేదు. 

రాజస్థాన్ రాయల్స్, జాసన్ హోల్డర్‌ని రూ.5 కోట్ల 75 లక్షలకు కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ కోసం ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్ హోరాహోరీగా బిడ్డింగ్ చేశాయి. 

ముంబై ఇండియన్స్ జట్టు రూ.17.5 కోట్లకు కామెరూన్ గ్రీన్‌ని దక్కించుకుంది. ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్‌ కోసం రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ బరిలో నిలిచాయి. పర్సులో రూ.7.45 కోట్లు పెట్టుకున్న రాజస్థాన్ రాయల్స్, రూ.7.25 కోట్ల వరకూ బెన్ స్టోక్స్ కోసం బిడ్ చేసింది...

రాజస్థాన్ రాయల్స్ బిడ్డింగ్ నుంచి తప్పుకున్న తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ పోటీలోకి వచ్చింది. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కూడా రేసులోకి వచ్చి రూ.16.25 కోట్లకు బెన్ స్టోక్స్‌ని కొనుగోలు చేసింది.. 

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్ ఇంగ్లాండ్ యంగ్ ఆల్‌రౌండర్ సామ్ కుర్రాన్ రికార్డు క్రియేట్ చేశాడు. ఇంతవరకూ 2021 వేలంలో రూ.16.25 కోట్లు దక్కించుకున్న క్రిస్ మోరిస్ రికార్డును బ్రేక్ చేసిన సామ్ కుర్రాన్, రూ.18.50 కోట్లకు పంజాబ్ కింగ్స్‌కి అమ్ముడుపోయాడు...


ఓడియన్ స్మిత్‌ని సీఎస్‌కే రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది గుజరాత్ టైటాన్స్. జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రాజాని రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్.. 

Follow Us:
Download App:
  • android
  • ios