Asianet News TeluguAsianet News Telugu

ముగిసిన ఐపీఎల్ 2023 మినీ వేలం: ఆఖర్లో అమ్ముడుపోయిన జో రూట్, షకీబ్ అల్ హసన్, రిలే రసో..

రూ.4 కోట్ల 60 లక్షలకు రిలే రసోని కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. చివర్లో అమ్ముడుపోయిన ఆడమ్ జంపా, జో రూట్, షకీబ్ అల్ హసన్.. 

IPL 2023 mini-auction completed: Joe Root, Shakib Al Hasan, Rile rossow gets
Author
First Published Dec 23, 2022, 8:46 PM IST

ఐపీఎల్ 2023 మినీ వేలం రెండో రౌండ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్ రిలే రసో కోసం రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీపడ్డాయి. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రూ.4 కోట్ల 60 లక్షలకు రిలే రసోని కొనుగోలు చేసింది. 25 మంది ప్లేయర్లను కొనుగోలు చేయగా ఢిల్లీ పర్సులో రూ.5 కోట్ల దాకా మిగులు ఉండడం విశేషం..

అకీల్ హుస్సేన్‌ని రూ.1 కోటికి కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఆడమ్ జంపాని రూ.1 కోటి 50 లక్షలకు కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్. లిటన్ దాస్‌ని కేకేఆర్ రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది..

అన్‌మోల్ ప్రీత్ సింగ్‌ని రూ.20 లక్షల బేస్ ప్రైజ్‌కి కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. కె.ఎం. అసిఫ్‌ని రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్.. 

మురుగన్ అశ్విన్‌ని రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్. మన్‌దీప్ సింగ్‌ని రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది కేకేఆర్. సౌతాఫ్రికా బ్యాటర్ రస్సీ వాన్ దేర్ దుస్సేన్‌ రెండో రౌండ్‌లో కూడా ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించలేకపోయాడు..

ఆకాశ్ వశిస్ట్‌ని రాజస్థాన్ రాయల్స్ బేస్ ప్రైజ్ రూ.20 లక్షలకు దక్కించుకుంది. బంగ్లా ఆల్‌రౌండర్ నవీన్ వుల్ హక్‌ని లక్నో సూపర్ జెయింట్స్‌ రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది...

యుద్‌వీర్ చరక్‌ని లక్నో, రాఘవ్ గోయల్‌ని ముంబై ఇండియన్స్ బేస్ ప్రైజ్  రూ.20 లక్షలకు కొనుగోలు చేశాయి. అబ్దుల్ పీఏని రూ.20 లక్ష్లకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది..

జో రూట్‌ని రూ.1 కోటికి కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్. షకీబ్ అల్ హసన్‌‌ని రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసింది కేకేఆర్.. ఐపీఎల్ 2023 మినీ వేలంలో రికార్డులు క్రియేట్ అయ్యాయి. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్లుగా సామ్ కుర్రాన్ (రూ.18.50 కోట్లు), కామెరూన్ గ్రీన్ (రూ.17.5 కోట్లు) సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. బెన్ స్టోక్స్ రూ.16.25 కోట్లు దక్కించుకోగా నికోలస్ పూరన్‌ రూ.16 కోట్లు దక్కించుకున్నాడు. అయితే ఈ మినీ వేలంలో స్టార్ ప్లేయర్లకు నిరాశే ఎదురైంది..  

సౌతాఫ్రికా బ్యాటర్ రస్సీ వాన్ దేర్ దుస్సేన్‌, విండీస్ బ్యాటర్ షెఫ్రెన్ రూథర్‌ఫర్డ్‌ అన్‌సోల్డ్ ప్లేయర్ల లిస్టులో చేరిపోయారు. ఇంగ్లాండ్ ప్లేయర్ విల్ జాక్స్‌ని రూ.3 కోట్ల 20 లక్షలకు కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... ఐర్లాండ్ బ్యాటర్ పాల్ స్టిర్లింగ్‌ని కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ ముందుకు రాలేదు. 


ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్, భారత బ్యాటర్ మన్‌దీప్ సింగ్‌లను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయలేదు.  ఆఫ్ఘాన్ కెప్టెన్ మహ్మద్ నబీ,  సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ వేన్ పార్నెల్ కూడా అన్‌సోల్డ్ ప్లేయర్ల జాబితాలో చేరారు. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జిమ్మీ నీశమ్, లంక కెప్టెన్ దసున్ శనక కూడా అమ్ముడుపోలేదు..

పియూష్ చావ్లాని ముంబై ఇండియన్స్ రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది. అమిత్ మిశ్రాని లక్నో సూపర్ జెయింట్స్ రూ.50 లక్షలకు కొనుగోలు చేశాయి.  హర్‌ప్రీత్ భాటియాని రూ.40 లక్షలకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్...

Follow Us:
Download App:
  • android
  • ios