Asianet News TeluguAsianet News Telugu

IPL 2023 MI vs RR: టాస్ గెలిచిన సంజూ శాంసన్... రోహిత్ బర్త్ డే, ఐపీఎల్‌లో 1000వ మ్యాచ్..

IPL 2023: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్...  ఐపీఎల్‌లో ఇది 1000వ మ్యాచ్...

IPL 2023 MI vs RR: Rajasthan Royals captain sanju samson won the toss, Rohit birthday, 1000th IPL match CRA
Author
First Published Apr 30, 2023, 7:04 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా నేడు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ జట్టు, రాజస్థాన్ రాయల్స్‌తో తలబడుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 

2008లో ప్రారంభమైన ఐపీఎల్‌లో ఇది 1000వ మ్యాచ్. ముంబై ఇండియన్స్ సారథిగా ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన రోహిత్ శర్మ, నేడు 36వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. వరుస పరాజయాలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్, నేటి మ్యాచ్‌లో గెలిచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని ఆశిస్తోంది...

మరోవైపు రాజస్థాన్ రాయల్స్‌ వరుస విజయాలతో జోరు మీద ఉంది. గత మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో 32 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది రాజస్థాన్ రాయల్స్. తన సూపర్ కెప్టెన్సీతో ధోనీ సేనకే ఝలక్ ఇచ్చిన సంజూ శాంసన్, ముంబై సారథి రోహిత్ శర్మ టీమ్‌ని ఓడించగలడా?

రాజస్థాన్ రాయల్స్ టీమ్‌ ఎక్కువగా ఓపెనర్లు యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్‌లపైనే ఆధారపడి ఉంది. గత మూడు మ్యాచుల్లో జోస్ బట్లర్ తన రేంజ్ పర్పామెన్స్ ఇవ్వలేకపోయాడు. బట్లర్ క్రీజులో కుదురుకోవడానికి చాలా సమయం తీసుకుంటున్నాడు...

సంజూ శాంసన్ ఎప్పటిలాగే నిలకడలేమి చూపిస్తుంటే సిమ్రాన్ హెట్మయర్‌ కూడా అతనితో జాయిన్ అయ్యాడు. ఈ ఇద్దరూ ఏ మ్యాచ్‌లో ఆడతారో, ఏ మ్యాచ్‌లో ఫెయిల్ అవుతారో వాళ్లకే తెలియని పరిస్థితి. మిడిల్ ఆర్డర్‌లో ధృవ్ జురెల్, దేవ్‌దత్ పడిక్కల్‌ చక్కగా రాణిస్తున్నారు..

బౌలింగ్‌లో సందీప్ శర్మ, యజ్వేంద్ర చాహాల్, రవిచంద్రన్ అశ్విన్ అదరగొడుతున్నారు. గత మ్యాచ్‌లో ఆడమ్ జంపాని దింపి, సూపర్ సక్సెస్ అయ్యింది రాజస్థాన్ రాయల్స్. 

మరోవైపు ముంబై ఇండియన్స్, వరుసగా పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ చేతుల్లో ఓడింది. 7 మ్యాచుల్లో 3 విజయాలతో అట్టడుగున ఢిల్లీకి పైన ఉన్న ముంబై ఇండియన్స్, ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే ఇకపై ప్రతీ మ్యాచ్ గెలిచి తీరాల్సిందే.. 

రోహిత్ శర్మతో పాటు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, కామెరూన్ గ్రీన్ నిలకడగా రాణించలేకపోతున్నారు. తిలక్ వర్మ కూడా గత రెండు మ్యాచుల్లో ఫెయిల్ అయ్యాడు. బౌలింగ్‌లో పియూష్ చావ్లా తప్ప మరో బౌలర్ పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నారు. అర్జున్ టెండూల్కర్‌ని కేవలం మొదటి 2 ఓవర్లు వేయడం కోసమే ఆడిస్తున్నట్టుగా ఉంది. జూనియర్ టెండూల్కర్ వల్ల మిగిలిన 2 ఓవర్లు వేయడానికి మరో బౌలర్‌ని ఆడించాల్సిన పరిస్థితి...

దీంతో అతన్ని తప్పించిన ముంబై ఇండియన్స్, జోఫ్రా ఆర్చర్‌తో పాటు బెహ్రాడార్ఫ్ ప్లేస్‌లో అర్షద్ ఖాన్‌ని తుది జట్టులోకి తీసుకొచ్చింది. 

ముంబై ఇండియన్స్ జట్టు ఇది: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, జోఫ్రా ఆర్చర్, పియూష్ చావ్లా, కుమార్ కార్తీకేయ, రిలే మెడరిత్, అర్షద్ ఖాన్

 రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇది: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్, దేవ్‌దత్ పడిక్కల్, ధృవ్ జురెల్, సిమ్రాన్ హెట్మయర్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యజ్వేంద్ర చాహాల్

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios