Asianet News TeluguAsianet News Telugu

IPL 2023 GT vs MI: టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్... బ్యాటర్లపైనే భారం వేసిన రోహిత్...

IPL 2023 టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్... లక్నోపై ఉత్కంఠ విజయం సాధించి జోరు మీదున్న గుజరాత్ టైటాన్స్... 

IPL 2023 GT vs MI: mumbai Indians won the toss and elected to field first against gujarat titans CRA
Author
First Published Apr 25, 2023, 7:03 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ జట్టు, ముంబై ఇండియన్స్‌తో తలబడుతోంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.  

ఇప్పటిదాకా మిగిలిన ఫ్రాంఛైజీలన్నీ ఏడేసి లీగ్ మ్యాచులు ఆడేయగా ఈ మ్యాచ్‌‌తో ఐపీఎల్ 2023 సీజన్‌లో సరిగ్గా సగం లీగ్ మ్యాచులు అవుతాయి.  మొదటి 6 మ్యాచుల్లో 3 విజయాలు అందుకున్న ముంబై ఇండియన్స్‌కి బౌలింగ్ యూనిట్‌లో అనుభవ లేమి వెంటాడుతూ ఉంది...

భారీ ఆశలు పెట్టుకున్న జోఫ్రా ఆర్చర్ మూడు మ్యాచుల తర్వాత రీఎంట్రీ ఇచ్చినా ఇప్పటిదాకా ఒరగబెట్టింది ఏమీ లేదు. అతను తప్ప ముంబైలో సరైన మరో ఫాస్ట్ బౌలర్ లేడు. జాసన్ బెహ్రాన్‌డార్ఫ్, హృతిక్ షోకీన్, అర్జున్ టెండూల్కర్‌లపైనే ఆధారపడుతోంది ముంబై ఇండియన్స్... నేటి మ్యాచ్‌లో జోఫ్రా ఆర్చర్, హృతిక్ షోకీన్‌లను తప్పించిన ముంబై ఇండియన్స్, కుమార్ కార్తీకేయ, రిలే మెడరిత్‌లకు తుది జట్టులో అవకాశం ఇచ్చింది.

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి 5 ఓవర్లలో 90కి పైగా పరుగులు సమర్పించింది ముంబై ఇండియన్స్. సీనియర్ స్పిన్నర్ పియూష్ చావ్లా ఒక్కడే ముంబై తరుపున బౌలింగ్‌లో ఒంటరి పోరాటం చేస్తున్నాడు..

బ్యాటింగ్‌లో మాత్రం రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, తిలక్ వర్మ అందరూ అదరగొడుతున్నారు. 

మరోవైపు గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది. వరుసగా 3 మ్యాచుల్లో గెలిచిన తర్వాత రెండు మ్యాచుల్లో ఓడిన టైటాన్స్‌కి లక్నోపై ఊహించని విజయం బూస్ట్ ఇవ్వొచ్చు...

అయితే ఆరంభంలో అదరగొట్టిన శుబ్‌మన్ గిల్, ఆ తర్వాత వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. వృద్ధిమాన్ సాహాకి ఆరంభం దక్కుతున్నా, దాన్ని సరిగ్గా వాడుకోలేకపోతున్నాడు. హార్ధిక్ పాండ్యా బ్యాటు నుంచి ఈసారి రావల్సినన్ని మెరుపులు రావడం లేదు...

విజయ్ శంకర్ ఓ మ్యాచ్‌లో మెరవగా అభినవ్ మనోహార్ ఫెయిల్ అవుతున్నాడు. డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్‌లకు బ్యాటింగ్ ఆడే అవకాశం వచ్చింది తక్కువ. అందులో వాళ్లు ఆడిందీ తక్కువే...

అయితే బౌలింగ్ యూనిట్‌లో గుజరాత్ టైటాన్స్ అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. మహ్మద్ షమీకి తోడు మోహిత్ శర్మ కూడా అదిరిపోయే బౌలింగ్‌తో టైటాన్స్‌కి విజయాలు అందిస్తున్నాడు. రషీద్ ఖాన్ ఈ సీజన్‌లో ఇప్పటికే హ్యాట్రిక్ సాధించగా అల్జెరీ జోసఫ్ కూడా ఆకట్టుకుంటున్నాడు..

గత సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 5 పరుగుల తేడాతో పోరాడి ఓడింది. ముంబై ఇండియన్స్ తరుపున ఆడిన హార్ధిక్ పాండ్యా, తన పాత టీమ్‌పై పగ తీర్చుకునేందుకు ఎదురుచూస్తున్నాడు..

గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా, శుబ్‌మన్ గిల్, హార్ధిక్ పాండ్యా, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నేహాల్ వదేరా, కుమార్ కార్తికేయ, అర్జున్ టెండూల్కర్, రిలే మెడరిత్, పియూష్ చావ్లా, జాసన్ బెహ్రాన్‌డార్ఫ్

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios