టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్‌ మురళీ కార్తీక్‌తో ఆశీష్ నెహ్రా మజాక్... నొప్పితో విలవిలలాడిన మురళీ కార్తీక్, చూస్తూ నవ్వుకున్న ఆశీష్ నెహ్రా... సోషల్ మీడియాలో వీడియో వైరల్.. 

కొందరు ఫీల్డ్‌లో విధానం కాస్త వింతగా ఉంటుంది. హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా ఎప్పుడు నవ్వుతారో, ఎప్పుడు ఎవరిపై అరుస్తారో చెప్పలేం. అలాగే ఆశీష్ నెహ్రా... చాలా కూల్‌గా కనిపించే ఈ టైటాన్స్ కోచ్, తనతో క్లోజ్‌గా ఉండేవాళ్లతో పరమ క్రూరంగా వ్యవహరిస్తాడు... క్రూరంగా అనే పదం కాస్త క్రూరంగా ఉన్నా, క్లోజ్ ఫ్రెండ్స్‌తో కఠినంగా వ్యవహరించేవాళ్లకు ఈ పదం సరైనదే. తాజాగా కోల్‌కత్తా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇలాంటి ప్రవర్తనతోనే ట్రెండింగ్‌లో నిలిచాడు ఆశీష్ నెహ్రా...

నేడు (ఏప్రిల్ 29)న 44వ పుట్టినరోజు జరుపుకుంటున్న టీమిండియా మాజీ బౌలర్, గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశీష్ నెహ్రా, తన స్నేహితుడు మురళీ కార్తీక్‌ని సెంటర్ పాంటింగ్‌లో కొట్టిన వీడియో, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.. తన మాజీ టీమ్ మేట్, టీమిండియా మాజీ క్రికెటర్ మురళీ కార్తీక్, ప్రస్తుతం ఐపీఎల్ 2023 సీజన్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. స్ట్రాటెజిక్ టైం బ్రేక్ సమయంలో గ్రౌండ్‌లోకి వచ్చిన మురళీ కార్తీక్ దగ్గరికి వెళ్లిన ఆశీష్ నెహ్రా, తన కాలితో అతని సెంటర్ పాంటింగ్‌లో తన్నాడు. సరదాగా చేసిన ఈ పనికి, షాకైన మురళీ కార్తీక్‌ నొప్పిని తట్టుకోలేక కిందపడిపోయాడు..

బ్రేక్ సమయంలో జరిగిన ఈ వ్యవహరం, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆశీష్ నెహ్రా ఇల చేయడం ఇదే మొదటి సారేం కాదు. ఇంతకుముందు ఐపీఎల్ 2022 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో యజ్వేంద్ర చాహాల్‌ని వెనకి నుంచి పట్టుకుని తన్నాడు ఆశీష్ నెహ్రా...

Scroll to load tweet…

మ్యాచ్ మొదలయ్యాక బౌండరీ లైన్ దగ్గర ఫీల్డర్లతో మాట్లాడుతూ వార్తల్లో నిలిచాడు ఆశీష్ నెహ్రా. ఐపీఎల్ 2023 సీజన్‌లో మొదటి 7 మ్యాచుల్లో 5 విజయాలు అందుకున్న గుజరాత్ టైటాన్స్, ప్లేఆఫ్స్ రేసుకి చేరువైంది. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం అందుకున్న గుజరాత్ టైటాన్స్, 8 మ్యాచులు ముగిసే సమయానికి 6 విజయాలతో టేబుల్ టాపర్‌గా నిలిచింది.

అంతర్జాతీయ క్రికెట్‌లో 235 వికెట్లు తీసిన ఆశీష్ నెహ్రా, 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 2003 వన్డే వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టిన ఆశీష్ నెహ్రా, ప్రపంచ కప్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన భారత బౌలర్‌గా ఉన్నాడు.. ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్‌గా ఆశీష్ నెహ్రాని సెలక్ట్ చేయడం పిచ్చి నిర్ణయమని విశ్లేషించాడు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్. అయితే వారి అంచనాలను తలకిందులు చేస్తూ టైటాన్స్, మొదటి సీజన్‌లోనే టైటిల్ గెలిచింది.