Asianet News TeluguAsianet News Telugu

వుమెన్స్ ఐపీఎల్ వస్తే, టీమ్ కొనడానికి మేం రెఢీ... రాజస్థాన్ రాయల్స్ సీఈవో కామెంట్...

వచ్చే ఏడాది ఆరు జట్లతో వుమెన్స్ ఐపీఎల్ ప్రారంభించాలని ఆలోచనలు చేస్తున్న భారత క్రికెట్ బోర్డు... టీమ్ కొనడానికి మేం సిద్ధమని ప్రకటించిన రాజస్థాన్ రాయల్స్ సీఈవో...

IPL 2022: We love to have a Women's IPL Team, Says Rajasthan Royals CEO Jack lush
Author
India, First Published May 14, 2022, 6:37 PM IST

ఐపీఎల్ ఆరంభమై 15 సీజన్లు పూర్తయినా, ఇప్పటిదాకా వుమెన్స్ ఐపీఎల్ గురించి ఎలాంటి అడుగు వేయలేదు బీసీసీఐ. ఐపీఎల్ తర్వాత ప్రారంభమైన బీబీఎల్‌ వంటి లీగుల్లోనూ వుమెన్స్ కోసం స్పెషల్ టోర్నీలు నడుస్తుంటే, ఐపీఎల్ మాత్రం ఇంకా ఆ ముందడుగు వేయలేకపోతోంది...

వుమెన్స్ క్రికెట్‌కి పెరుగుతున్న ఆదరణ, ఐసీసీ వుమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2022 టోర్నీకి వచ్చిన రేటింగ్స్‌కి కళ్లు తెరిచిన భారత క్రికెట్ బోర్డు, వచ్చే ఏడాది వుమెన్స్ ఐపీఎల్ ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలియచేసింది. వుమెన్స్ టీ20 ఛాలెంజ్ పేరుతో నాలుగు మ్యాచుల టోర్నీ నిర్వహిస్తూ, చేతులు దులుపుకుంటున్న బీసీసీఐ... వచ్చే ఏడాది ఆరు జట్లతో వుమెన్స్ ఐపీఎల్ గ్రాండ్‌గా ప్రారంభించాలని భావిస్తున్నట్టు ప్రకటించింది...

వుమెన్స్ ఐపీఎల్ వస్తే, టీమ్ కొనడానికి ఎదురుచూస్తున్నట్టు కామెంట్ చేశాడు రాజస్థాన్ రాయల్స్ సీఈవో జాక్ లష్ మెక్‌కర్రమ్... ‘వుమెన్స్ ఐపీఎల్ టీమ్ కొనడానికి ఆసక్తిగా ఉన్నాం. వచ్చే ఏడాది లాంఛ్ అయితే మా ఫ్రాంఛైజీని విస్తరించడానికి సిద్ధంగా ఉన్నాం... 

భారత్‌లో వుమెన్స్ క్రికెట్‌ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోంది, ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ప్రపంచవ్యాప్తంగానూ వుమెన్స్ క్రికెట్‌ని చూసే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. భవిష్యత్తు ఆడాళ్లదే...  ‘ది హండ్రెడ్’, ‘వుమెన్స్ బిగ్ బాష్ లీగ్స్’ ద్వారా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఇప్పటికే మహిళా క్రికెట్‌ను ప్రోత్సహించడం మొదలెట్టాయి...

వాళ్లు వుమెన్స్ క్రికెట్‌పై భారీ పెట్టుబడులు పెట్టారు. ది హండ్రెడ్‌లో వుమెన్స్ క్రికెట్‌ చాలా బాగా సక్సెస్ అయ్యింది. వుమెన్స్ క్రికెట్ మ్యాచ్ చూడడానికి చాలా మంది ఫ్యాన్స్ స్టేడియానికి వచ్చారు. క్రికెట్ ఆడే అమ్మాయిల సంఖ్య కూడా బాగా పెరిగింది... ఇవన్నీ మంచి పరిణామాలే...’ అంటూ కామెంట్ చేశాడు రాజస్థాన్ రాయల్స్ సీఈవో జాక్ లష్ మెక్‌కర్రమ్...

2017లో రాజస్థాన్ రాయల్స్‌లో చేరిన జాక్ లష్ మెక్‌కర్రమ్, 2021లో ఆ ఫ్రాంఛైజీకి సీఈవోగా బాధ్యతలు తీసుకున్నాడు. ఐపీఎల్ 2008 సీజన్‌లో షేన్ వార్న్ కెప్టెన్సీలో మొట్టమొదటి టైటిల్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్, ఆ తర్వాత ఫైనల్ కూడా అర్హత సాధించలేకపోయింది...

ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో మిగిలిన జట్ల కంటే తెలివిగా ప్లేయర్లను కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్. జోస్ బట్లర్‌తో పాటు యజ్వేంద్ర చాహాల్, రవిచంద్రన్ అశ్విన్, ప్రసిద్ధ్ కృష్ణ, ట్రెంట్ బౌల్డ్ వంటి ప్లేయర్లు ఆర్ఆర్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు...

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇప్పటిదాకా ఆడిన 12 మ్యాచుల్లో 7 విజయాలు అందుకుని, పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచుల్లో ఒక్క విజయం అందుకున్నా నెట్ రన్ రేట్ కారణంగా ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించే అవకాశం ఉంటుంది రాయల్స్‌. రెండు మ్యాచుల్లో గెలిస్తే, మిగిలిన జట్లతో సంబంధం లేకుండా నేరుగా ప్లేఆఫ్స్‌కి అర్హత సాధిస్తుంది...

Follow Us:
Download App:
  • android
  • ios