TATA IPL 2022: మార్కెట్ కు వెళ్లి కూరగాయలు కొన్నంత ఈజీగా సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విటర్ ను దక్కించుకున్నాడు  ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. అయితే ఇప్పుడు ఆయన భారత్ లో ఫుడ్ డెలివరీలో నెంబర్ వన్ గా ఉన్న  స్విగ్గీని కొనేయాలంటున్నాడు గిల్. 

ఎవరూ ఊహించని విధంగా ట్విటర్ ను దక్కించుకున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు నెటిజ్లను తమ సమస్యలు కూడా ఏకరువు పెడుతున్నారు. తమకు ఫలానా యాప్ తో సమస్య ఉందని, ఫలానా సంస్థ సేవలు తమకు సరిగా అందడం లేదని అతడికి ట్వీట్ల ద్వారా విన్నవించుకుంటున్నారు. తాజాగా ఈ జాబితాలో గుజరాత్ టైటాన్స్ స్టార్ బ్యాటర్ శుభమన్ గిల్ కూడా చేరాడు. టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ ను ఓ వింత కోరిక కోరాడు. ఇటీవలే ట్విటర్ ను కొనుగోలు చేసిన మస్క్.. భారత్ లో ఫుడ్ డెలివరీ లో నెంబర్ వన్ గా ఉన్న స్విగ్గీని కూడా కొనుగోలు చేయాలని కోరాడు. అప్పుడైనా వాళ్లు త్వరగా ఫుడ్ డెలివరీలు చేస్తారని పేర్కొన్నాడు. 

ఇందుకు సంబంధించి గిల్.. ఎలన్ మస్క్ ను ట్యాగ్ చేస్తూ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. దీనిపై స్విగ్గీతో పాటు పలువురు నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ట్విటర్ లో గిల్ ఓ పోస్టు చేస్తూ.. ‘ఎలాన్ మస్క్, దయచేసి మీరు స్విగ్గీని కూడా కొనుగోలు చేయండి. అప్పుడైనా వాళ్లు త్వరగా ఫుడ్ డెలివరీలు సరైన టైమ్ కు చేస్తారు..’ అని రాసుకొచ్చారు. ఈ ట్వీట్ చేసిన కొంతసేపటికే నెట్టింట వైరల్ గా మారింది. 

Scroll to load tweet…

గిల్ చేసిన ట్వీట్ కు స్విగ్గీ రిప్లై ఇచ్చింది. ‘హాయ్ శుభమన్ గిల్. ట్విట్టర్ ఉన్నా లేకున్నా మీరు మా పోర్టల్ లో ఆర్డర్ ఇచ్చినట్లయితే తప్పకుండా సరైన సమయంలో డెలివరీ అయ్యేలా చేస్తాం. మీరు మాకు నేరుగా మెసేజ్ చెయ్యొచ్చు. మేము వెంటనే స్పందించి సేవలు అందిస్తాం..’ అని రాసుకొచ్చింది. 

ఇదిలాఉండగా.. గిల్ చేసిన ట్వీట్ కు నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. స్విగ్గీ ఖాతా పేరిట ఉన్న ఓ యూజర్.. ‘నీ టీ20 ఆటకంటే మేము త్వరగానే స్పందిస్తాం..’ అని కామెంట్ చేశాడు. మిస్టర్ ఫర్ఫెక్ట్ అనే మరో యూజర్.. ‘ట్రాఫిక్ సమస్య వలనో లేక హోటల్ లో త్వరగా ఇవ్వకపోవడం వల్లో కొంత లేట్ కావచ్చు. వాళ్లు (డెలివరీ బాయ్స్) కావాలని అలా చేయరు. నేను కూడా డెలివరీ ఎగ్జిక్యూటివ్ నే. మాకు సరైన సమయంలో ఫుడ్ డెలివరీ కాలేదని చెప్పడం తేలికే. కానీ మా పరిస్థితి కూడా కొంచెం అర్థం చేసుకోవాలి..’ అని రాసుకొచ్చాడు.

Scroll to load tweet…

చంద్రమోహన్ అనే మరో యూజర్ స్పందిస్తూ.. ‘డీయర్ శుభమన్.. మీరు ఒక వారం రోజుల పాటు డెలివరీ ఎగ్జిక్యూటివ్ గా చేయండి. మా బాధలు మీకు తెలుస్తాయి. మీరు డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చుని సంపాదించినదానిలో ఫుడ్ డెలివరీ బాయ్స్ రోజంతా డెలివరీలు చేసినా ఒక్క శాతం కూడా సంపాదించలేరు..’ అని కామెంట్ చేశాడు. మరో యూజర్ స్పందిస్తూ.. ‘స్విగ్గీ కంటే ఏకంగా దేశంలో రోడ్లు, ట్రాఫిక్ వ్యవస్థనే కొనేస్తే అయిపోద్దిగా..’ అని ఫన్నీగా రాసుకొచ్చాడు.