Asianet News TeluguAsianet News Telugu

IPL 2022 KKR vs SRH: టాస్ గెలిచిన కేకేఆర్... వరుస ఓటములకు ఆరెంజ్ ఆర్మీ బ్రేక్ వేస్తుందా?

IPL 2022 SRH vs KKR: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్... నేటి మ్యాచ్‌లో ఓడితే కేకేఆర్ కూడా ఇంటికే... 

IPL 2022 KKR vs SRH: Kolkata Knight Riders won the toss and elected to bat first
Author
India, First Published May 14, 2022, 7:04 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు, కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో తలబడుతోంది. టాస్ గెలిచిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 

ఇరు జట్ల మధ్య సీజన్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 175 పరుగులు భారీ స్కోరు చేయగా ఆ టార్గెట్‌ని 17.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది ఆరెంజ్ ఆర్మీ... కేన్ విలియంసన్, అభిషేక్ శర్మ విఫలమైనా అయిడిన్ మార్క్‌రమ్, రాహుల్ త్రిపాఠి కలిసి మూడో వికెట్‌కి 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్‌ని ముగించారు. 

గత మ్యాచ్‌లో ఐదు మార్పులు చేసిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్, విజయాన్ని అందుకుంది. అయితే ప్యాట్ కమ్మిన్స్ గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరం కావడం కేకేఆర్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. 

ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఫ్యాన్స్‌కి పెద్దగా ఆశలు, అంచనాలు లేవు. మొదటి రెండు మ్యాచుల్లో ఆరెంజ్ ఆర్మీ ఆటతీరు కూడా అలాగే సాగింది. అయితే మూడో మ్యాచ్‌ నుంచి వరుసగా ఐదు విజయాలు అందుకుంది కేన్ మామ టీమ్...

కెప్టెన్ కేన్ విలియంసన్‌ బ్యాటింగ్‌లో విఫలమవుతున్నా మిడిల్ ఆర్డర్‌లో అయిడిన్ మార్క్‌రమ్, నికోలస్ పూరన్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా రాణిస్తూ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కి వరుసగా ఐదు విజయాలు అందించారు...

గత సీజన్లలో ఓపెనర్లు రాణిస్తే, విజయం అంచుల దాకా తీసుకెళితే, సన్‌రైజర్స్ హైదరాబాద్ మిడిల్ ఆర్డర్ చేతుల్లోకి వచ్చిన మ్యాచ్‌ని జారవిడిచేది. అయితే ఇప్పుడు మిడిల్ ఆర్డర్ రాణిస్తుంటే, సరైన ఓపెనింగ్ దక్కడం లేదు...  ముఖ్యంగా కెప్టెన్ కేన్ విలియంసన్ తన రేంజ్ ఇన్నింగ్స్ ఇప్పటిదాకా ఒక్కటి కూడా ఆడలేకపోయాడు. డేవిడ్ వార్నర్‌ని కాదని, కేన్ మామని రిటైన్ చేసుకుని, కెప్టెన్సీ అప్పగిస్తే... అతనే జట్టుకి భారంగా మారాడు...

కేకేఆర్ పరిస్థితి కూడా అంతే. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ అద్భుతాలు చేస్తుందని అనుకుంటే, ఆఖరి స్థానంలో నిలిచేందుకు ముంబై, చెన్నైలతో పోటీపడుతోంది కేకేఆర్...  

సన్‌రైజర్స్ హైదరాబాద్ సీజన్‌లో వరుసగా ఐదు విజయాలు అందుకని, ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడింది. కేకేఆర్ మాత్రం మొదటి రెండు మ్యాచుల తర్వాత వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడి, ఆ తర్వాత మూడు మ్యాచుల్లో రెండు విజయాలు అందుకుంది...

పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్, 8వ స్థానంలో ఉన్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి ఈ మ్యాచ్ విజయం కీలకం కానుంది. నేటి మ్యాచ్‌లో ఓడితే కేకేఆర్ ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా తప్పుకుంటుంది. సన్‌రైజర్స్‌కి మాత్రం చాలా తక్కువ అవకాశాలు సజీవంగా ఉంటాయి.
 

సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, కేన్ విలియంసన్, రాహుల్ త్రిపాఠి, అయిడిన్ మార్క్‌రమ్, నికోలస్ పూరన్, శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్

 

కోల్‌కత్తా నైట్‌రైడర్స్: వెంకటేశ్ అయ్యర్, అజింకా రహానే, నితీశ్ రాణా, శ్రేయాస్ అయ్యర్, సామ్ బిల్లింగ్స్,  రింకూ సింగ్, ఆండ్రే రస్సెల్, సునీల్ నరైన్, ఉమేశ్ యాదవ్, టిమ్ సౌథీ, వరుణ్ చక్రవర్తి

 

Follow Us:
Download App:
  • android
  • ios