ఐపీఎల్-15లో లీగ్ లోకి అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్ తొలి సీజన్ లోనే టైటిల్ కొట్టింది. రాజస్తాన్ రాయల్స్ ను తొలుత 130 పరుగులకే కట్టడి చేసిన గుజరాత్.. ఆ తర్వాత స్వల్ప లక్ష్యాన్ని మరో11 బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఆ జట్టు ఓపెనర్ శుభమన్ గిల్ (45), డేవిడ్ మిల్లర్ (32) లు విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు. రాజస్తాన్ పై 7 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది.
IPL 2022 GT vs RR: గుజరాత్ టైటాన్స్ దే ఐపీఎల్-15 ట్రోఫీ.. రాజస్తాన్ కు నిరాశ..

IPL 2022 Finals GT vs RR: ఐపీఎల్-15 ముగింపు దశకు చేరుకున్నది. రెండునెలలకు పైగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను అలరిస్తున్న ఐపీఎల్-2022 లో నేడు గుజరాత్ టైటాన్స్- రాజస్తాన్ రాయల్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ లో హార్ధిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్.. సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్తాన్ రాయల్స్ పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా సీజన్ లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్ లోనే టైటిల్ నెగ్గింది.
గుజరాత్ టైటాన్స్ దే ఐపీఎల్-15 ట్రోఫీ
విజయం దిశగా గుజరాత్ టైటాన్స్..
ఐపీఎల్ లో ఈ సీజన్ లోనే ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ తొలి సీజన్ లోనే టైటిల్ అందుకునేందుకు సిద్ధమవుతున్నది. 17 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు.. 3 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. పాండ్యా స్థానంలో వచ్చిన డేవిడ్ మిల్లర్ (29 నాటౌట్) గుజరాత్ విజయాన్ని మరింత తొందర చేస్తున్నాడు. ప్రసిధ్ వేసిన 17వ ఓవర్లో డేవిడ్ మిల్లర్ బ్యాక్ టు బ్యాక్ బౌండరీలు కొట్టాడు. శుభమన్ గిల్ (37) క్రీజులో ఉన్నాడు.
పాండ్యా ఔట్.. చాహల్ కే పర్పుల్ క్యాప్
ఆశలు కోల్పోతున్న రాజస్తాన్ రాయల్స్ కు యుజ్వేంద్ర చాహల్ కొత్త ఊపిరిలూదాడు. నిలకడగా ఆడుతున్న గుజరాత్ టైటాన్స్ సారథి హార్ధిక్ పాండ్యా (34) ను ఔట్ చేశాడు. తద్వారా ఈ సీజన్ లో పర్పుల్ క్యాప్ ను హసరంగ నుంచి దక్కించుకున్నాడు. పాండ్యాను ఔట్ చేయడంతో చాహల్.. ఒక సీజన్ లో అత్యధిక వికెట్లు దక్కించుకున్న స్పిన్నర్ (27) అయ్యాడు. అంతకుముందు 2019 లో ఇమ్రాన్ తాహిర్ (26) ఈ రికార్డు సాధించాడు. కాగా.. తాజాగా పాండ్యాను ఔట్ చేయడం ద్వారా చాహల్.. హసరంగ కంటే ఒక వికెట్ ఎక్కువ సాధించనవాడయ్యాడు. ఫలితంగా ఈ సీజన్ లో ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ రెండూ రాజస్తాన్ కే దక్కనున్నాయి.
గేర్ మార్చిన పాండ్యా-గిల్.. ఫిఫ్టీ భాగస్వామ్యం
తొలి పది ఓవర్లు నెమ్మదిగా ఆడిన గుజరాత్ టైటాన్స్ జోరు పెంచింది. గుజరాత్ సారథి హార్ధిక్ పాండ్యా గేర్ మార్చాడు. అశ్విన్ వేసిన 12వ ఓవర్ లో వరుస బంతుల్లో 4, 6 బాదాడు. ఆ ఓవర్ లో గుజరాత్ 15 పరుగులు పిండుకుంది. 13 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ 2 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. హార్ధిక్ పాండ్యా (31), శుభమన్ గిల్ (32) లు ఆడుతున్నారు. వీళ్లిద్దరూ మూడో వికెట్ కు 61 పరుగులు జోడించారు.
పది ఓవర్లకు గుజరాత్ స్కోరు ఇదే..
పది ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్.. 2 వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది. గుజరాత్ నిలకడగా ఆడుతున్నది. రాజస్తాన్ బౌలర్లు తమ శక్తి వంచన లేకుండా పోరాడుతున్నారు. హార్ధిక్ పాండ్యా (11), శుభమన్ గిల్ (23) క్రీజులో ఉన్నారు. పది ఓవర్లలో గుజరాత్.. 77 పరుగులు చేయాల్సి ఉంది.
8 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు..
ఛేదించాల్సిన లక్ష్యం స్వల్పం (131) గా ఉండటంతో గుజరాత్ టైటాన్స్ ఎలాంటి భారీ షాట్స్ కు వెళ్లకుండా నెమ్మదిగా ఆడుతున్నది. రాజస్తాన్ బౌలర్లు కట్టడి గా బౌలింగ్ చేస్తున్నారు. 8 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్.. 2 వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది. హార్ధిక్ పాండ్యా (4), శుభమన్ గిల్ (14) క్రీజులో ఉన్నారు. 12 ఓవర్లలో గుజరాత్.. 93 పరుగులు చేయాల్సి ఉంది.
వేడ్ ఔట్.. రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్
బ్యాటింగ్ లో విఫలమైన రాజస్తాన్ బౌలింగ్ లో అదరగొడుతున్నది. తన రెండో ఓవర్ మెయిడిన్ వేసిన బౌల్ట్.. మూడో ఓవర్లో మాథ్యూ వేడ్ (8) ను పెవిలియన్ కు పంపాడు. 10 బంతుల్లో 8 పరుగులు చేసిన వేడ్.. బౌల్ట్ బౌలింగ్ లో రియాన్ పరాగ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఐదు ఓవర్లకు గుజరాత్.. 2 వికెట్ల నష్టానికి 25 పరుగులు చేసింది. హార్ధిక్ పాండ్యా (0), శుభమన్ గిల్ (5) క్రీజులో ఉన్నారు.
బౌల్ట్ మెయిడిన్ ఓవర్... ప్రసిధ్ సూపర్ బౌలింగ్
స్వల్ప లక్ష్యాన్ని కట్టడి చేసే క్రమంలో రాజస్తాన్ బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్ తో బంతులు విసురుతున్నారు. మూడో ఓవర్ వేసిన ట్రెంట్ బౌల్ట్ మెయిడిన్ ఓవర్ వేయగా.. నాలుగో ఓవర్ వేసిన ప్రసిధ్ 11 పరుగులిచ్చాడు. అయితే ఇందులో ఐదు ఎక్స్ట్రాల రూపంలో వచ్చినవే. 4 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్.. వికెట్ నష్టానికి 22 పరుగులు చేసింది. శుభమన్ గిల్ (4), మాథ్యూ వేడ్ (8) క్రీజులో ఉన్నారు.
సాహా క్లీన్ బౌల్డ్.. గుజరాత్ కు తొలి షాక్..
రాజస్తాన్ రాయల్స్ బౌలర్ ప్రసిధ్ కృష్ణ గుజరాత్ కు తొలి షాకిచ్చాడు. ఫామ్ లో ఉన్న ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (5) ను ప్రసిధ్ బౌల్డ్ చేశాడు. ప్రసిధ్ వేసిన రెండో ఓవర్లో రెండో బంతిని సాహా ఫోర్ కొట్టగా.. నాలుగో బంతికి సాహాను క్లీన్ బౌల్డ్ చేసి రాజస్తాన్ కు తొలి వికెట్ అందించాడు. రెండు ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్.. వికెట్ నష్టానికి 11 పరుగులు చేసింది.
చాహల్ క్యాచ్ మిస్.. బతికిపోయిన గిల్
తక్కువ స్కోరును కట్టడి చేసే క్రమంలో రాజస్తాన్ రాయల్స్ మంచి అవకాశం మిస్ చేసుకుంది. గుజరాత్ ఇన్నింగ్స్ లో ట్రెంట్ బౌల్ట్ వేసిన తొలి ఓవర్ లో నాలుగో బంతికి శుభమన్ గిల్ ఇచ్చిన క్యాచ్ ను యుజ్వేంద్ర చాహల్ జారవిడిచాడు. ఇక తర్వాత బంతికే గిల్.. ఫైన్ లెగ్ దిశగా బౌండరీ కొట్టాడు. తొలి ఓవర్ లో గుజరాత్ వికెట్లేమీ నష్టపోకుండా 5 పరుగులు చేసింది.
ఇన్నింగ్స్ ముగిసింది.. గుజరాత్ టార్గెట్ ఇదే..
గుజరాత్ టైటాన్స్ - రాజస్తాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న ఐపీఎల్-15 లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ దారుణంగా విఫలమైంది. రాజస్తాన్ ఇన్నింగ్స్ ముగిసేసరికి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (39) టాప్ స్కోరర్. యశస్వి జైస్వాల్ (22), సంజూ శాంసన్ (14), దేవదత్ పడిక్కల్ (2), హెట్మెయర్ (11), అశ్విన్ (6), రియాన్ పరాగ్ (15) విఫలమయ్యారు. హార్దిక్ పాండ్యా 3 వికెట్లు తీయగా.. సాయి కిషోర్ కు 2 వికెట్లు దక్కాయి. దయాల్, రషీద్, షమీకి తలో వికెట్ దక్కింది. గుజరాత్ టైటాన్స్.. 20 ఓవర్లలో 131 పరుగులు చేస్తే తొలి సీజన్ లోనే కప్ కొట్టిన టీమ్ గా చరిత్ర సృష్టిస్తుంది..?
బౌల్ట్ ఔట్.. ఇంక మూడు వికెట్లే..
ట్రెంట్ బౌల్ట్ (11) పెవిలియన్ చేరాడు. చివరి పవర్ ప్లేలో అయినా తమ ఆటగాళ్లు రాణిస్తారని అనుకున్న రాజస్తాన్ ఫ్యాన్స్ కు నిరాశను మిగుల్చుతూ ఆ బ్యాటర్లు వరుస కట్టి డగౌట్ కు చేరుకుంటున్నారు. 18 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్.. 7 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ (6), ఒబెడ్ మెక్ కాయ్ (7) లు క్రీజులో ఉన్నారు. మరో రెండు ఓవర్లు మాత్రమే మిగిలున్నాయి.
అశ్విన్ కూడా అదే బాటలో..
ఐపీఎల్ ఫైనల్ లో రాజస్తాన్ రాయల్స్ కష్టాలు ఓవర్ ఓవర్ కు మరింత రెట్టింపవుతున్నాయి. ప్రధాన బ్యాటర్లంతా పెవిలియన్ కు చేరిన వేళ కాస్త మెరుపులు మెరిపిస్తాడనుకున్న రవిచంద్రన్ అశ్విన్ (6) కూడా పెవిలియన్ చేరాడు. సాయి కిషోర్ వేసిన 16వ ఓవర్లో ఆఖరి బంతికి అతడు.. డేవిడ్ మిల్లర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం రాజస్తాన్.. 16 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది.
హెట్మెయర్ ఔట్.. 15 ఓవర్లకు రాజస్తాన్ స్కోరు ఎంతంటే..
15 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ రాయల్స్ 5 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లు కట్టడి చేస్తుండటంతో రాజస్తాన్ కు పరుగుల రాక కష్టమైంది. హార్దిక్ పాండ్యా వేసిన 15వ ఓవర్లో ఆఖరి బంతికి హెట్మెయర్ (11) అతడికే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అశ్విన్ (4), రియాన్ పరాగ్ (0) క్రీజులో ఉన్నారు. రాజస్తాన్ ఇన్నింగ్స్ కు మరో 5 ఓవర్లు మాత్రమే మిగిలున్నాయి.
వార్నర్ రికార్డు బ్రేక్ చేసిన బట్లర్.. కోహ్లి రికార్డ్ సేఫ్
ఐపీఎల్-15లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న జోస్ బట్లర్.. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ రికార్డును బద్దలు కొట్టాడు. ఒక సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో బట్లర్.. వార్నర్ (848) రికార్డును బ్రేక్ చేశాడు. బట్లర్.. ఈ సీజన్ లో 863 పరుగులు చేశాడు. ప్రస్తుతం అతడు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా ఉన్నాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లి (973) అగ్రస్థానంలో ఉన్నాడు. 2016 లొో కోహ్లి ఈ ఘనత సాధించాడు. ఇక గుజరాత్-రాజస్తాన్ మ్యాచ్ లో బట్లర్ 39 పరుగులు ఔట్ చేసిన ఔటవడంతో కోహ్లి రికార్డు బద్దలు కొట్టే అవకాశం కోల్పోయాడు.
బట్లర్ ఔట్.. రాజస్తాన్ కష్టాలు డబుల్
రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ (39) ఔటయ్యాడు. హార్ధిక్ పాండ్యా వేసిన 13.1 ఓవర్లో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
విసిగి వేసారిన పడిక్కల్ ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన రాజస్తాన్
8 బంతులాడినా పరుగుల ఖాతా తెరవక విసిగిపోయిన రాజస్తాన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ (10 బంతుల్లో 2) చివరికి రషీద్ ఖాన్ వేసిన 12వ ఓవర్ ఐదో బంతికి షమీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 12 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ 3 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. బట్లర్ (39), హెట్మెయర్ (0) క్రీజులో ఉన్నారు.
పది ఓవర్లకు రాజస్తాన్ స్కోరు ఇదే..
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆడుతున్న రాజస్తాన్ రాయల్స్ తొలి పది ఓవర్లలో ఆశించిన మేర రాణించడంలో విఫలమవుతున్నది. గుజరాత్ టైటాన్స్ కట్టుదిట్టమైన బౌలింగ్ తో రాజస్తాన్ కు పరుగుల రాకే కష్టమైంది. పది ఓవర్లు ముగసేసరికి ఆ జట్టు.. 2 వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (36), దేవదత్ పడిక్కల్ (0) క్రీజులో ఉన్నారు.
సంజూ శాంసన్ ఔట్.. కష్టాల్లో రాజస్తాన్
రాజస్తాన్ రాయల్స్ రెండో వికెట్ కోల్పోయింది. హార్ధిక్ పాండ్యా వేసిన 9వ ఓవర్ రెండో బంతికి.. సాయి కిషోర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. శాంసన్.. 11 బంతుల్లో 14 పరుగులు చేశాడు. 9 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ రాయల్స్ 2 వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ (0), జోస్ బట్లర్ (23) క్రీజులో ఉన్నారు.
నెమ్మదిగా ఆడుతున్న రాజస్తాన్.. 8 ఓవర్లకు స్కోరు ఇదే..
రాజస్తాన్ రాయల్స్ ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్నది. గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండటంతో భారీ షాట్లు కరువయ్యాయి. 8 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ వికెట్ నష్టానికి 59 పరుగులు చేసింది. సంజూ శాంసన్ (14), జోస్ బట్లర్ (22) క్రీజులో ఉన్నారు.