టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్... తొలి విజయం కోసం ఎదురుచూస్తున్న సీఎస్‌కే, సన్‌రైజర్స్... తొలి రెండు మ్యాచుల్లో టాస్ గెలిచినా విజయాలు అందుకోలేకపోయిన ఆరెంజ్ ఆర్మీ...
ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సారథి కేన్ విలియంసన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో ఈ రెండు జట్లూ ఇప్పటిదాకా తొలి విజయాన్ని రుచి చూడకపోవడం విశేషం...
కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్, ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ చేతుల్లో ఘోర పరాజయాలను చవిచూసింది. ఐపీఎల్ కెరీర్‌లో తొలిసారిగా హ్యాట్రిక్ పరాజయాలు అందుకున్న సీఎస్‌కే, తొలి విజయం కోసం సన్‌రైజర్స్‌నే నమ్ముకుంది...
గత సీజన్‌లో మూడంటే మూడు మ్యాచుల్లో గెలిచి అట్టర్ ఫ్లాప్ పర్పామెన్స్ ఇచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఇంకా ఆ మూడ్ నుంచి బయటికి రాలేదు. ఐపీఎల్ 2022 సీజన్‌ను వరుసగా రెండు దారుణ పరాజయాలతో ప్రారంభించింది ఆరెంజ్ ఆర్మీ...
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని ఛేదించకలేక చేతులు ఎత్తేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈజీ టార్గెట్‌ను కొట్టలేక చతికిలపడింది. సన్‌రైజర్స్ గత మ్యాచుల్లో ఇచ్చిన పర్ఫామెన్స్ బట్టి చూస్తే, నేటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టడం ఖాయం...
అదీకాకుండా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై సీఎస్‌కేకి ఘనమైన రికార్డు ఉంది. ఇరుజట్ల మధ్య ఇప్పటిదాకా 16 మ్యాచులు జరగగా సన్‌రైజర్స్ 4 మ్యాచులు మాత్రమే గెలిచింది. సీఎస్‌కేకి 12 మ్యాచుల్లో విజయాలు దక్కాయి. గత 10 మ్యాచుల్లో 8 మ్యాచుల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కి విజయాలు దక్కడం మరో విశేషం...
మొదటి మూడు మ్యాచుల్లో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్, నేటి మ్యాచ్‌లో ఓడితే దాదాపు ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారిపోతాయి. 10 ఫ్రాంఛైజీలు పాల్గొంటున్న సీజన్ కావడంతో ప్లేఆఫ్స్ చేరాలంటే ప్రతీ జట్టు కనీసం 8 విజయాలు అందుకోవాల్సి ఉంటుంది.
గత మ్యాచ్ అనుభవాలతో సన్‌రైజర్స్ హైదరాబాద్ నేటి మ్యాచ్‌లో రెండు మార్పులతో బరిలో దిగుతోంది. శశాంక్ సింగ్‌తో పాటు మార్కో జాన్సెన్‌కి తుది జట్టులో చోటు దక్కింది. అలాగే సీఎస్‌కే ప్లేయర్ ప్రెటోరియస్ స్థానంలో లంక ప్లేయర్ మహీశ్ తీక్షణకు అవకాశం కల్పించింది సీఎస్‌కే... లంక ప్లేయర్‌ను కొనుగోలు చేయడంపై తమిళనాడు క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పుడు అతను తుదిజట్టులోకి కూడా రావడంతో సీఎస్‌కే ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
చెన్నై సూపర్ కింగ్స్: రాబిన్ ఊతప్ప, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ ఆలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, ఎమ్మెస్ ధోనీ, డ్వేన్ బ్రావో, క్రిస్ జోర్డాన్, మహీష్ తీక్షణ, ముకేశ్ చౌదరి
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, కేన్ విలియంసన్, రాహుల్ త్రిపాఠి, అయిడిన్ మార్క్‌రమ్, నికోలస్ పూరన్, శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్, టీ నటరాజన్
