ప్రస్తుతం ఎక్కడ విన్నా.. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆటగాడు చేతన్ సకారియా పేరే వినపడుతోంది. ఒకప్పుడు కనీసం కాళ్లకు వేసుకోవడానికి బూట్లు కూడా లేని కుర్రాడు.. నిన్నటి మ్యాచ్ లో చెలరేగిపోయాడు. అతనే చేతన్ సకారియా. ఐపీఎల్ లో అతనిని ఈ ఏడాది రాజస్థాన్ జట్టు 1.2కోట్లు ఖర్చు పెట్టి మరీ కొనుగోలు చేసింది. కాగా.. అరంగేట్రంలోనే సకారియా అదరగొట్టాడు.

పంజాబ్ కింగ్స్ తో మంగళవారం రాజస్థాన్ జట్టు తలపడిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ మ్యాచ్ లో చేతన్ తన బ్రిలియంట్ బౌలింగ్ తో అందరినీ మెస్మరైజ్ చేశాడు. నిన్నటి మ్యాచ్ లో 3 వికెట్లు తీశాడు. అంతేకాదు.. 31 పరుగులు కూడా తీశాడు.

 

కాగా..  ఈ నేపథ్యంలో.. సకారియాపై ఇండియన్ మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసలు కురిపించాడు. అంతేకాకుండా.. సకారియా జీవితంలో జరిగిన ఓ ట్రాజెడీని కూడా తెలియజేశాడు. 

‘‘ఐపీఎల్ 14 సీజన్ ప్రారంభం కావడానికి ముందే.. చేతన్ సకారియా సోదరుడు ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయాడు. అతను చనిపోయిన 10 రోజుల వరకు ఆ విషయాన్ని అతని తల్లిదండ్రులు చేతన్ కి చెప్పలేదట. అప్పుడు చేతన్ ఎస్ఎంఏ ట్రోఫీ ఆడుతున్నాడు. ఐపీఎల్ నిజంగా.. ఇండియన్ యువ క్రికెటర్ల కలను నెరవేరుస్తుంది’’ అంటూ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశారు.