సన్ రైజర్స్ వైఫల్యాలకు బాధ్యుడిగా చేస్తూ.. వార్నర్ ను తొలగిస్తూ.. సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆ బాధ్యతల నుంచి వార్నర్ ని తొలగించి.. కేన్ విలయమ్సన్ కి అప్పగించారు.
ఐపీఎల్ 2021లో సన్ రైజర్స్ హైదరాబాద్ వరస పరాజయాలను ఎదురు చూసింది. ఇప్పటి వరకు ఆరు మ్యాచులు ఆడినా.. కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలవడం గమనార్హం. మరో మ్యాచ్ గెలుపు చివరంచులదాకా వచ్చి సూపర్ ఓవర్ లో ఓటమిపాలయ్యారు. కాగా.. ఈ వరస ఫెయిల్యూర్ లకు తానే బాధ్యుడినంటూ ఇటీవల వార్నర్ పేర్కొన్నారు. అలా చెప్పాడో లేదో.. ఇలా అనూహ్యంగా వార్నర్ ని కెప్టెన్సీ నుంచి తొలగించారు.
సన్ రైజర్స్ వైఫల్యాలకు బాధ్యుడిగా చేస్తూ.. వార్నర్ ను తొలగిస్తూ.. సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆ బాధ్యతల నుంచి వార్నర్ ని తొలగించి.. కేన్ విలయమ్సన్ కి అప్పగించారు.
విలియమ్సన్‌కు కెప్టెన్సీ ఇవ్వడాన్ని ఎవరూ తప్పుబట్టకపోయినా ఇలా అర్థాంతరంగా వార్నర్ ని తప్పించడం అభిమానులకు మింగుడు పడటం లేదు. గత సీజన్‌లో కేకేఆర్ కెప్టెన్‌గా కొనసాగిన దినేశ్ కార్తీక్ కూడా ఇలానే మధ్యలో తన పదవి నుంచి తప్పుకున్నాడు. అప్పుడు కార్తీక్ స్వయంగా తప్పుకున్నానని ప్రకటించడంతో పెద్దగా వివాదం చెలరేగలేదు. కానీ వార్నర్ విషయంలో సన్‌రైజర్స్ కాస్త దూకుడుగానే వ్యవహరించిందనే చెప్పాలి. ఒక ప్లేయర్‌గా ఐపీఎల్‌లో మంచి రికార్డులు ఉన్న వార్నర్‌ను తప్పించడం వెనుక కొంతమంది హస్తం ఉందని సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది.
ఇదిలా ఉంచితే, వార్నర్‌ను సన్‌రైజర్స్ కెప్టెన్‌గా తప్పించిన తర్వాత ఈ లెఫ్ట్‌హ్యాండర్ గతంలో పోస్ట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలు వైరల్‌గా మారాయి. హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌ల జరగపోవడాన్ని ప్రస్తావిస్తూ చేసిన ఇన్‌స్టా పోస్ట్ ఒకటి ఇప్పుడు వైరల్ అయ్యింది. ఆపై వార్నర్ రూపానికి తన పెయింటింగ్‌తో అద్భుతంగా చిత్రీకరించిన ఒక అభిమానికి థాంక్స్ చెప్పిన పోస్ట్ కూడా ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
