డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ జట్టు స్థానంలో వచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్... ఏడేళ్లుగా అదరగొడుతోంది. 2016లో ఛాంపియన్‌గా నిలిచిన హైదరాబాద్, 2018లో రన్నరప్‌గా నిలిచింది. ఐదుసార్లు ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. కేవలం 2014, 2015 సీజన్లలో మాత్రమే ఆరో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

‘ఆరెంజ్ ఆర్మీ’ నుంచి ఈసారి కూడా అదే రేంజ్ డామినేషన్ ఆశిస్తున్నారు అభిమానులు. గత ఐదు సీజన్లలో నాలుగుసార్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాట్స్‌మెన్ ఆరెంజ్ క్యాప్ అందుకున్నారు. 2015, 2017, 2019 సీజన్లలో డేవిడ్ వార్నర్ ఆరెంజ్ క్యాప్ అందుకోగా... 2018లో కేన్ విలియంసన్‌కు ఆరెంజ్ క్యాప్ దక్కింది.

2016, 2017 సీజన్లలో వరుసగా పర్పుల్ క్యాప్ గెలిచాడు భువనేశ్వర్ కుమార్. 2016, 2019 సీజన్లలో ఫెయిర్ ప్లే అవార్డు కూడా అందుకున్న ఎస్ఆర్‌హెచ్, ఐపీఎల్‌లో మంచి ఆధిక్యం చూపిస్తోంది. ఈసారి కూడా సన్‌రైజర్స్ షైన్ అవ్వాలని కోరుకుంటున్నారు అభిమానులు.