క్రికెట్ అనేది ఓ మతం అయితే దానికి దేవుడ సచిన్ టెండూల్కర్. అనితర సాధ్యమైన రికార్డులెన్నో క్రియేట్ చేసిన సచిన్ టెండూల్కర్, 2013లో క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్, క్రికెట్‌లో సత్తా చాటుతూ జాతీయ జట్టులో చోటు సంపాదించాలని ప్రయత్నిస్తున్నాడు.

మొదట బ్యాట్స్‌మెన్‌గా రాణించేందుకు ప్రయత్నించిన అర్జున్, పోటీ ఎక్కువగా ఉండడంతో బౌలర్‌గా మారాడు. 20 ఏళ్ల అర్జున్ ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగ్రేటం చేయకపోయినా ఐపీఎల్‌లో మాత్రం ఈ ఏడాది ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే ప్రొఫెషనల్ ప్లేయర్‌గా కాదు, నెట్ బౌలర్‌గా. 

సచిన్ మెంటర్‌గా వ్యవహారిస్తున్న ముంబై ఇండియన్స్ జట్టుకు నెట్ బౌలర్‌గా అర్జున్ ఆడుతున్నాడు. తండ్రితో పాటు దుబాయ్ వెళ్లిన అర్జున్, అక్కడ రోహిత్,  పాండ్యా వంటి స్టార్లకు బౌలింగ్ వేస్తూ... ట్రెంట్ బౌల్ట్, బుమ్రా వంటివారి వద్ద మెలకువలు నేర్చుకుంటున్నాడు.