చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ కోచ్‌కి వింత అనుభవం...డగౌట్ ఇంటర్వ్యూ సమయంలో రికీ పాంటింగ్‌తో పరిహాసం ఆడిన రిషబ్ పంత్...ట్విట్టర్‌లో షేర్ చేసిన రికీ పాంటింగ్... సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో...

IPL 2020 సీజన్‌లో అద్భుతమైన ఆటతీరు ప్రదర్శిస్తోంది యంగ్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్. ఈ సీజన్‌లో ఢిల్లీ టాప్ క్లాస్ పర్ఫామెన్స్‌కి ఎక్కువ శాతం క్రెడిట్ కోచ్ రికీ పాంటింగ్‌కే దక్కుతోంది. బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ కూడా దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నట్టు ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, ఓపెన్‌గానే ప్రకటించిన విషయం తెలిసిందే. ఓ జట్లు మంచి ప్రదర్శన ఇవ్వాలంటే కోచ్‌కీ, ప్లేయర్లకీ మధ్య మంచి కనెక్షన్ ఏర్పడాలి. అలాంటి అనుబంధమే ఢిల్లీ ప్లేయర్లతో పాంటింగ్‌కి ఏర్పడింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Scroll to load tweet…

;

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 180 పరుగుల భారీ లక్ష్యాన్ని అద్భుతంగా చేధించింది ఢిల్లీ క్యాపిటల్స్. ఓపెనర్ శిఖర్ ధావన్ అజేయ సెంచరీతో చెలరేగగా, ఆఖర్లో అక్షర్ పటేల్ మూడు సిక్సర్లతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌ సందర్భంగా డీసీ కోచ్ రికీ పాంటింగ్, కామెంటేటర్లతో డగౌట్ ఇంటర్వ్యూ ఇచ్చాడు.

Scroll to load tweet…

ఈ సమయంలో మెల్లిగా పాంటింగ్ వెనక్కి వచ్చిన రిషబ్ పంత్, పాంటింగ్ మాట్లాడుతున్నంతసేపు ఫన్నీ ఫన్నీ హవభావాలతో పరిహాసమాడాడు. అక్కడే కూర్చున్న స్టోయినిస్ ఏదో చెప్పడంతో వెనక నుంచి తొంగి చూశాడు. ఈ ఫన్నీ సంఘటన టీవీ ప్రేక్షకులకు నవ్వు తెప్పించగా, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై రికీ పాంటింగ్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ‘ఒక రోజు నేను కూడా ప్రశాంతంగా ఇంటర్వ్యూ ఇస్తాను’ అంటూ రిషబ్ పంత్‌ను, స్టోయినిస్‌ను ట్యాగ్ చేశాడు.