దుబాయ్: భారత క్రికెట్ జట్టు కెప్టెన్, రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ (ఆర్సీబీ) సారథి విరాట్ కోహ్లీ గురువారంనాడు తన 32వ జన్మ దిన వేడుకను జరుపుకుంటున్నారు. ఐపిఎల్ ఆర్సీబీ టీమ్ విరాట్ కోహ్లీకి ఎమోషనల్ బర్త్ డే విషెస్ చెప్పింది. 

రెడ్ అండ్ గోల్డ్ కు రక్తాన్ని, స్వేదాన్ని, కన్నీళ్లను ఇచ్చిన వ్యక్తికి అంటూ ఆర్సీబీ జట్టు ట్వీట్ చేసింది. టు అవర్ లీడర్ అండ్ లెజెండ్ అని ప్రశంసిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. దాంతో పాటు విరాట్ కోహ్లీ గ్రాఫిక్ ను షేర్ చేసింది. 

 

ఈ జన్మదిన వేడుకలు గొప్పగా ఉండాలని ఆశించింది. 2008లో ఏపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి లీగ్ లో ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. ఐపిఎల్ అధికారిక ట్విట్టర్ లో కూడా విరాట్ కోహ్లీకి బర్త్ డే విషెస్ చెప్పారు. ఐపిఎల్ అధికారిక ట్విట్టర్ లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ప్రదర్శన చేసిన వీడియోను షేర్ చేసింది. 

 

విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 191 ఐపిఎల్ మ్యాచులు ఆడాడు. 5872 పరుగుుల ేచశాడు. ఈ సీజన్ లో లీగ్ దశ నాటికి 460 పరుగులు చేశాడు. ఆర్సీబీ ప్రస్తుతం ప్లే ఆఫ్ కు చేరుకుంది. శుక్రవారం ప్లే ఆఫ్ మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాదు జట్టును ఎదుర్కోనుంది.