ఈ భారీ విజయంతో ఫుల్ జోష్‌లో డేవిడ్ వార్నర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించింది ఆరెంజ్ ఆర్మీ. డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగిన రచ్చ సెలబ్రేషన్స్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. 34వ పుట్టినరోజు జరుపుకుంటున్న డేవిడ్ వార్నర్‌ ముఖానికి కేక్ మొత్తం పూసేశారు సన్‌రైజర్స్ యంగ్ ప్లేయర్లు ప్రియమ్ గార్గ్, అబ్దుల్ సమద్, ఖలీల్ అహ్మద్.

దీంతో రెచ్చిపోయిన డేవిడ్ వార్నర్ జట్టు సభ్యులందరిపై కేక్ విసరడం మొదలెట్టారు. సన్‌రైజర్స్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్‌కి కేక్ పూశాడు వార్నర్. మురళీధరన్ కౌంటర్ కేక్ అటాక్ చేశాడు. గార్గ్, వృద్ధమాన్ సాహాకి శ్రద్ధగా కేక్ పూస్తుండగా వెనకనుంచి వచ్చి అతనిపై కేక్‌పై అటాక్ చేశాడు వార్నర్.

మొత్తంగా వార్నర్ భాయ్ బర్త్ డే సెలబ్రేషన్స్‌ను ఓ రేంజ్‌లో సెలబ్రేట్ చేసుకుంది ఆరెంజ్ ఆర్మీ. 12 మ్యాచుల్లో ఐదింట్లో గెలిచిన సన్‌రైజర్స్, ప్లేఆఫ్ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచుల్లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మిగిలిన మ్యాచ్ ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. పూర్తి వీడియోను ఇక్కడ చూడండి.